పోలీసు సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తాం | - | Sakshi
Sakshi News home page

పోలీసు సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తాం

May 23 2026 12:34 AM | Updated on May 23 2026 12:34 AM

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తు న్న సిబ్బంది సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యమిస్తామని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి అన్నారు. డయల్‌ యువర్‌ ఎస్పీ (పోలీస్‌ గ్రీవెన్స్‌) ఫోన్‌–ఇన్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఉన్న సిబ్బందితో ఫోన్లో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

సైట్‌ ఇంజినీర్ల రెన్యువల్‌ నిలుపుదల

శ్రీకాకుళం: శ్రీకాకుళం సమగ్ర శిక్షలో సైట్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్న ముగ్గురికి రెన్యువల్‌ నిలుపుదల చేస్తూ ఎస్‌పీడీ బి.శ్రీనివాసరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సమగ్ర శిక్ష ప్రాజెక్టులో పని చేస్తున్న ఏడుగురు సైట్‌ ఇంజనీర్లపై పలు ఆరోపణలు రావడం, దీనిపై ఎస్‌పీడీ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. విచారణ సమయంలో కూడా వీరు సహకరించకపోవడం, కొన్ని ఫైళ్లు కనపడకుండా చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ ఏడుగురిని పక్క జిల్లాకు బదిలీ చేసిన విషయం విదితమే. అనంతరం విచారణ చేపట్టిన ఏపీసీ ఈఈలు నివేదికలను సమర్పించారు. వీటిని పరిశీలించిన ఎస్‌పీడీ.. ఫైళ్ళు మాయం చేయడం, నిధులు దుర్వినియోగం చేయడం వాస్తవమని నిర్ధారించుకొని ఏడుగురిలో ముగ్గురిని రెన్యువల్‌ చేయకుండా నిలుపుదల చేశారు. వీరిలో ఎన్‌.పట్టాభిరామారావు బి.చంద్రమౌళి, పెద్దింటి రామానందం ఉన్నారు. మిగిలిన నలుగురు విషయం ప్రస్తావించలేదు. అయితే విచారణ మరింత లోతుగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement