టెక్కలి రూరల్: టెక్కలి నడిబొడ్డున ఉన్న సంతోషిమాత దేవాలయంలో చోరీ జరిగినట్లు అర్చకులు గుర్తించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా పరిషత్ రోడ్డులో ఉన్న సంతోషిమాత ఆలయం తలుపులకు వేసి ఉన్న తాళాలను గుర్తు తెలియని వ్యక్తులు బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించారు. మూడు హుండీల్లోని నగదుని దొంగిలించారు. అమ్మవారి మెడలో పుస్తెలను సైతం చోరీ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజీలు పరిశీలించి క్లూస్ టీం సహాయంతో వివరాలు సేకరించారు. ఆలయ ఈవో మనస్వి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టెక్కలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, శుక్రవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి తరలిరాగా.. చోరీ నేపథ్యంలో పోలీసులు, క్లూస్ టీం వచ్చినంత వరకు భక్తులను గుడిలోకి రానివ్వలేదు.


