ఆటోపై కూలిన చెట్టు | - | Sakshi
Sakshi News home page

ఆటోపై కూలిన చెట్టు

May 23 2026 12:34 AM | Updated on May 23 2026 12:34 AM

మెళియాపుట్టి: పట్టుపురం–పెద్దలక్ష్మీపురం గ్రామాల మధ్య ఆటోపై ఓ చెట్టు కూలిపోయింది. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా నీలాపురం గ్రామానికి చెందిన వి.లక్ష్మణరావు గారబంద నుంచి చాపర వైపు ఆటోలో ప్రయాణికులతో వస్తున్నాడు. పెద్దలక్ష్మీపురం దాటాక చింతచెట్టు ఒక్కసారిగా ఆటోపై పడింది. డ్రైవర్‌ గమనించి వెంటనే వెనక్కి వెళ్లడంతో ముందుభాగంపై మాత్రమే చెట్టుకొమ్మలు పడ్డాయి. ఆ సమయంలో ఆటోలో ఓ మహిళ కూర్చుంది. ఆమె వెనుకవైపు కూర్చోవడంతో గాయాలు కాలేదు. డ్రైవర్‌ లక్ష్మణరావు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని జేసీబీతో చెట్టును తొలగించారు. ఓ రైతు చెట్టుకు నిప్పంటించడంతో గత కొద్దిరోజులుగా కాలుతూ శుక్రవారం ఇలా కూలిపోయిందని చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement