ఏపీఎల్‌కు ముగ్గురు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఏపీఎల్‌కు ముగ్గురు ఎంపిక

May 21 2026 12:20 AM | Updated on May 21 2026 12:20 AM

నరసన్నపేట: ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ పోటీలకు నరసన్నపేట క్రికెట్‌ సబ్‌సెంటర్‌కు చెందిన ముగ్గురు క్రికెటర్లు ఎంపికయ్యారు. జూన్‌ 5 నుంచి కడప, మంగళగిరి, విశాఖల్లో జరగనున్న ఏపీఎల్‌ పోటీలకు ఎస్‌డీవీఎన్‌ ప్రసాద్‌, మురపాక రోహిత్‌, గొద్దు తరుణ్‌సాయిలు ఎంపిక అయ్యారు. వీరు అమరావతి రోయల్స్‌ తరఫున పోటీల్లో పాల్గొంటారు. ప్రసాద్‌కు రూ.10 లక్షలు, రోహిత్‌కు రూ.1.05 లక్షలు, తరుణ్‌సాయికి రూ.30 వేలుకు కొనుగోలు చేశారు. బుధవారం వీరిని వైఎంసీఏ ప్రతినిధి గొద్దు చిట్టిబాబు, సబ్‌సెంటర్‌ క్రికెట్‌ కోచ్‌ శ్రీను తదితరులు సత్కరించారు. పోటీల్లో మంచి ప్రతిభ కనబరచాలని ఆకాక్షించారు.

సారాతో ఇద్దరి అరెస్టు

కంచిలి: జలంత్రకోట గ్రామంలో సోంపేట ఎకై ్సజ్‌ సీఐ జి.వి.రమణ ఆధ్వర్యంలో బుధవారం సారా విక్రయాలు, రవాణాపై తనిఖీలు చేపట్టారు. గ్రామానికి చెందిన రత్నాల అనసూయ 100 సారా ప్యాకెట్లు, రత్నాల అర్జున్‌ 150 సారా ప్యాకెట్లు రవాణా చేస్తూ పట్టుబడ్డారు. వీరు రవాణాకు వినియోగించిన ద్విచక్ర వాహనం కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ సోంపేట కోర్టులో మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చగా 14 రోజులు రిమాండ్‌ విధించారు. తనిఖీల్లో ఎస్‌ఐలు జగన్నాథ్‌, ప్రసాద్‌, సిబ్బంది భానుప్రసాద్‌, ఉమాపతి, మార్కారావు పాల్గొన్నారు.

తప్పిన పెను ప్రమాదం

రణస్థలం: లావేరు మండలం తాళ్లవలస జాతీయ రహదారిపై విశాఖపట్నం వైపు నుంచి శ్రీకాకుళం వెళ్తున్న కారును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. క్షణాల్లోనే వెనక వచ్చిన మరో లారీ సడన్‌ బ్రేక్‌ వేయడంతో కారు దగ్గరకు వెళ్లి నిలిచింది. బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో వెనుక లారీ డ్రైవర్‌ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పెను ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. కారులో ఉన్న నలుగురికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. లావేరు పోలీసులు ట్రాఫిక్‌ చక్కదిద్దారు.

లారీని ఢీకొట్టిన వ్యాన్‌

రణస్థలం : రణస్థలం మండల కేంద్రంలోని దన్నానపేట సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం వైపు నుంచి వచ్చిన లారీ కొత్త పెట్రోల్‌ బంకు వద్ద ఉన్న మలుపు వద్ద యూ టర్న్‌ చేస్తుండగా అదే రూట్‌లో అతి వేగంగా వచ్చిన వాటర్‌ క్యాన్‌ల ఐసర్‌ వ్యాన్‌ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్‌ క్యాబిన్లో డ్రైవర్‌ ఇరుక్కుపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. క్రేన్‌ సహాయంతో డ్రైవర్‌ను బయటకు తీసి 108 వాహనంలో శ్రీకాకుళం తరలించారు. డ్రైవర్‌ వివరాలు తెలియా ల్సి ఉంది. జె.ఆర్‌.పురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు.

నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం

అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి టెక్కలికి చెందిన సత్యనారాయణమూర్తి మనుమడు టంకాల తరుణ్‌ పేరుమీద రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. బుధవారం ఆలయ అర్చకులు ఇప్పిలి మాధవశర్మకు విరాళ నగదును అందించారు. అనంతరం ఆదిత్యున్ని దాతల కుటుంబసభ్యులు దర్శించుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement