మెళియాపుట్టి: గొట్టపల్లి పరిస్థితిపై అధికారులు స్పందించారు. ఇక్కడ జ్వరాల విజృంభణపై ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో బుధవారం ఉదయమే ఆరోగ్యశాఖ అధికారులు హుటాహుటిన మందుల బ్యాగులు, రక్త పరీక్షల కిట్లు పట్టుకుని గొట్టిపల్లి గ్రామానికి పరుగులు తీశారు. మొత్తం 50 మందికి ర్యాపిడ్ టెస్టులు చేసినట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. అయితే జ్వరాలు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. తాగునీరు, పారిశుద్ధ్యం కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఊరిలో పర్యటించి జ్వర పీడితులతో మాట్లాడారు.


