శ్రీకాకుళం అర్బన్ : బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులకు, పెన్షనర్లకు రెండు విడతల కరువు భత్యం చెల్లించాలని ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ ఇన్ బీఎస్‌ఎన్‌ఎల్, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్స్ ఇన్ బీఎస్‌ఎన్‌ఎల్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం శ్రీకాకుళంలోని సంచారభవన్ వద్ద ధర్నా, మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓ వైపు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటుతుండటంతో జీవనం కష్టంగా మారుతోందని, బకాయి డీఏను వెంటనే చెల్లించాలని కోరారు. నిరసన కార్యక్రమంలో ప్రతినిధులు పోలాకి వెంకటరావు, మాతల గోవర్ధనరావు, బి.సూర్యనారాయణ, బి.ప్రసాదరావు, డి.వెంకటేశ్వరరావు, కె.కామేశ్వరరావు, డబ్ల్యూ మన్మధరావు, పి.మల్లేశ్వరరావు, వి.శ్రీనివాసరావు, ఐకేసీహెచ్ చరణ్, పంచిరెడ్డి రమణ, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.


