శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరంలో 4వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ టి.ఆదిలక్ష్మి, అధ్యాపకులతో కలిసి ప్రిన్సిపాల్ డాక్టర్ కింతలి సూర్యచంద్రరావు బుధవారం విడుదల చేశారు. బీఏ(ఆనర్స్) 81.40 శాతం, బీకాం(ఆనర్స్) 86.03 శాతం, బీఎస్సీ(ఆనర్స్) 88.48 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. మొత్తమ్మీద 86.14 శాతం ఫలితాలతో రాణించారని ప్రిన్సిపాల్ సంతోషం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.చిన్నారావు, డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పీఎస్ కనకదుర్గ, డీఈఓలు జి.శశికాంత్, బి.శ్రావణి, అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు.


