అసలు అనుమతి ఉందా? | - | Sakshi
Sakshi News home page

అసలు అనుమతి ఉందా?

May 21 2026 12:20 AM | Updated on May 21 2026 12:20 AM

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

జిల్లాలో రచ్చ లేపుతున్న బావాజీ మఠం భూముల వివాదం రోజురోజుకీ తీవ్రమవుతోంది. ఇందులో ఓ కీలక నేత ప్రవేశించడంతో అధికార, విపక్షాల మధ్య ఆరోపణల యుద్ధానికి దారితీసింది. సవాల్‌, ప్రతి సవాల్‌కు వేదికై ంది. అసలీ భూములు చేతులు మారడానికి అవకాశం ఉందా?అమ్మకానికి పెట్టడానికై నా! కొనుగోలు చేయడానికై నా వీలుందా? అంటే లేదని చెప్పాలి. సదావర్తి కింద ఆ మఠానికి చెందిన ఆలయ పోషణ కోసం కేటాయించిన భూములివి. వీటిని అమ్మడానికి, కొనడానికి ఎవరికీ హక్కులేదు. కానీ మఠానికి చెందిన కొందరు ప్రతినిధులు చేతివాటం ప్రదర్శించి, ఆ భూములను బయట వ్యక్తుల చేతుల్లో పెట్టే ప్రయత్నం చేశారు. అలాగని ఒకరికే చేశారా? అంటే కాదు. ఐదుగురు వ్యక్తులపై ఒకే భూమిపై అగ్రిమెంట్‌ కట్టేశారు. పక్కనున్న సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్లు కూడా చేసేశారు. ఇప్పుడిది అగ్రిమెంట్‌ కట్టించుకున్న వ్యక్తుల విభేదాలతో రచ్చకెక్కడం.. ఇదంతా సెటిల్‌ చేస్తానని ఓ కీలక నేత రంగప్రవేశం చేశారు. ఈ క్రమంలో కొందరికి అన్యాయం జరిగింది. ఇప్పుడిదే రచ్చ రచ్చ చేస్తోంది.

అంతిమ లబ్ధి కోసమేనా?

ఆమదాలవలస–శ్రీకాకుళం మార్గంలో తోటాడ–అక్కివరం రెవెన్యూ పరిధిలో బావాజీ మఠం భూములు ఉన్నాయి. సర్వే నంబర్‌ 121లో దాదాపు 400 ఏళ్ల చరిత్ర గల 199 ఎకరాల భూముల్ని సదావర్తి కింద అప్పట్లో కేటాయించారు. కాల క్రమేణా సాగు నిమిత్తం పలువురు రైతులకు కేటాయించారు. అవి అమ్మడానికి గానీ, కొనడానికి గానీ అవకాశం లేదు. బావాజీ మఠానికి చెందిన ఆలయం నగరంలో ఉంది. దాని పోషణ కోసం ఈ భూముల నుంచి వచ్చే ఫలసాయం, ఇతర ఆదాయాన్ని వినియోగించాలి. ఇప్పుడీ భూముల పర్యవేక్షణ బాధ్యత కూడా బలగకు చెందిన ఒక వ్యక్తికి అప్పగించారు. అందులోని 3ఎకరాలకు పైగా భూమిలో ఇటీవల ఒక లేఅవుట్‌ వెలిసింది. ఆ లేవుట్‌కు ఎలాంటి అధికారిక అనుమతుల్లేవు. అంతేకాకుండా అక్రమ లేఅవుట్‌కు రూ. కోటి 40లక్షల ఉపాధి నిధులతో సీసీ రోడ్లు వేశారు. ఈ రోడ్ల వలన చుట్టు పక్కల ఇళ్లకు కొంత మేలు జరిగినా...ఎక్కువగా ఉపయోగపడేది అక్రమ లేవుట్‌కే. ఇప్పుడా లేఅవుట్‌లో ప్లాట్లు చకచకా విక్రయాలు జరిగిపోతున్నాయి. ఎంతో విలువైన స్థలం కావడంతో ఆ మొత్తం లావాదేవీల వెనక ఓ కీలక నేత ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఆ నేతకు దాదాపు 60సెంట్లు మేర అంతిమ లబ్ధి పొందేలా పథక రచన చేశారన్న వాదనలు ఉన్నాయి.

అంతకుముందు ఏం జరిగిందంటే..

బావాజీ మఠం ప్రతినిధులు పూరిలో ఉంటారు. వారికి సంబంధించిన పురోహితులు మాత్రమే ఇక్కడ ఉంటున్నారు. కానీ, అధికారమంతా పూరిలో ఉన్న బావాజీ మఠం ప్రతినిధుల చేతుల్లోనే ఉండేది. నగరం పక్కనే విలువైన ఏరియా కావడంతో బావాజీ మఠం భూములపై కొందరు బడా వ్యక్తుల కన్ను పడింది. బావాజీ మఠం ప్రతినిధులను సంప్రదించారు. ఆ ప్రతినిధుల్లో ఇద్దరు ఒకరికి తెలియకుండా మరొకరికి సదరు బడా వ్యక్తులకు ఆ భూమిని విక్రయిస్తున్నట్టు అగ్రిమెంట్లు కట్టేశారు. ఒకే భూమిపై ఐదుగురికి అగ్రిమెంట్లు చేశారు. దీంతో మాదంటే మాదని సదరు అగ్రిమెం

మఠం ఆలయ పోషణకు ఉండాల్సిన బావాజీ మఠం భూములు వాస్తవంగా అమ్మడానికి లేదు. అలాగని అక్కడ లేఅవుట్‌ వేయడానికి వీల్లేదు. పోనీ, అనుమతులతో లేఅవుట్‌ వేశారా? అంటే అదీ లేదు. బావాజీ మఠం ప్రతినిధులు అడ్డగోలుగా చేసిన అగ్రిమెంట్‌లను పట్టుకుని పక్కనున్న సర్వే నంబర్లతో ఇష్టారీతిన రిజిస్ట్రేషన్లు చేసేసుకుని, ఆ భూమి మాదంటే మాది అని అగ్రిమెంట్‌ దారులు తిరుగుతున్నారు. వారి తాపత్రాయాన్ని క్యాష్‌ చేసుకోవడానికి కీలక నేత జోక్యం చేసుకున్నారు. అధికారం అండతో ఆ భూములను ఎలాగైనా ప్రైవేటు వ్యక్తులకు కన్ఫర్మ్‌ చేసేలా పావులు కదుపుతున్నారు. వాస్తవంగా ఈ భూమి నిషేధిత జాబితాలో ఉంది. అటు ప్రభుత్వానికి ,ఇటు ప్రైవేటు వ్యక్తులకు చెందకుండా మధ్యస్తంగా ఉన్నాయి. వీటిపై జిల్లా కోర్టు నుంచి హైకోర్టు వరకు కేసులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ లేఅవుట్‌ వేయడం, దాంట్లోని స్థలాలను విక్రయం చేయడం జరుగుతున్నాయి. ఇప్పుడిది జిల్లాలో వివాదాస్పదంగా మారింది. ఓ కీలక నేత రాజకీయ భవిష్యత్‌పై నీలి నీడలు కమ్ముకునేలా చేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement