నీరు పంపినా వేధింపులేనా..? | - | Sakshi
Sakshi News home page

నీరు పంపినా వేధింపులేనా..?

May 10 2026 9:46 AM | Updated on May 10 2026 9:46 AM

నీరు పంపినా వేధింపులేనా..? ‘అత్యంత పాశవికం’

టెక్కలి జిల్లా ఆస్పత్రిలో తీవ్ర నీటి కొరత

సొంత ఖర్చులతో ట్యాంకర్‌ పంపించిన వైఎస్సార్‌ సీపీ నాయకుడు పేరాడ తిలక్‌

ఆస్పత్రి వద్ద నీరు తీసుకోకుండా

ముప్పు తిప్పలు

ట్యాంకర్‌ డ్రైవర్‌తో పాటు కొంత మంది ఆస్పత్రి సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు

టెక్కలి:

టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులు, వారి సహాయకులు తీవ్రమైన నీటి ఇక్కట్లు పడుతుంటే.. అధికార పార్టీ నాయకులు మాత్రం రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ నీటి ఇబ్బందులు తెలుసుకుని వైఎస్సార్‌సీపీ టెక్కలి సమన్వయకర్త పేరా డ తిలక్‌ ఆస్పత్రికి వెళ్లి పరిశీలించి నీటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టే వరకు తన సొంత ఖర్చులతో ఆస్పత్రికి ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ అనుమతి తీసుకున్నా రు. ఈ క్రమంలో శనివారం మంచినీటి ట్యాంకర్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే మంచినీటి ట్యాంకర్‌ ఆస్పత్రికి చేరుకోగానే ఊహించని పరిస్థితులు ఎదురయ్యాయి. ఆస్పత్రి సిబ్బంది నీటి ట్యాంకర్‌ను తీసుకోకుండా లేనిపోని కారణాలతో ట్యాంకర్‌ను నిలిపివేశారు. అక్కడితో ఆగకుండా పోలీసు లు మరో అడుగు ముందుకేసి ట్యాంకర్‌ డ్రైవర్‌తో పాటు కొంత మంది ఆస్పత్రి దిగువ స్థాయి సిబ్బందిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారణ చేపట్టారు. మానవతా దృక్పథంతో ఆస్పత్రికి మంచినీటిని అందజేస్తే, రోగులు పడుతున్న అవస్థలను పక్కన పెట్టి ట్యాంకర్‌ను తీసుకోకుండా రాజకీయ కోణంలో ముప్పు తిప్పలు పెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు, నీటి ఇబ్బందులపై తరచూ ఆస్పత్రికి వచ్చే వారు అవస్థలు పడుతున్నప్పటికీ, వాటిపై మంత్రి అచ్చెన్నాయుడు దృష్టి సారించకపోగా, మానవీయ కోణంలో రోగుల కోసం తాము పంపించిన మంచినీటి ట్యాంకర్‌ను తీసుకోకుండా రాజకీయం చేయ డం అత్యంత పాశవికమని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌ మండిపడ్డారు. మంత్రి అచ్చెన్నాయుడు నియంతగా ప్రవర్తిస్తున్నారనే విషయానికి ఇది ఒక పెద్ద నిదర్శనమ ని తిలక్‌ గుర్తు చేశారు.

ఆస్పత్రిలో రోగులు నీటి ఇబ్బందులు పడుతున్నారనే విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ అనుమతి మేర కు నీటి ట్యాంకర్‌ను పంపించామన్నారు. దీన్ని కూడా రాజకీయ కోణంలో చూస్తూ రోగులకు మరింత ఇబ్బందులకు గురి చేసే విధంగా మంత్రి అచ్చెన్నాయుడు ప్రవర్తించారని దుయ్యబట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement