23న జిల్లా బూత్‌ కమిటీ విస్తృత స్థాయి సమావేశం | - | Sakshi
Sakshi News home page

23న జిల్లా బూత్‌ కమిటీ విస్తృత స్థాయి సమావేశం

Mar 22 2026 2:06 AM | Updated on Mar 22 2026 2:06 AM

నరసన్నపేట : వైఎస్సార్‌సీపీ జిల్లా బూత్‌ కమిటీల విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 23న నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళంలోని జిల్లా రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ హాలులో సాయంత్రం 3 గంటలకు జిల్లా బూత్‌ కమిటీ అధ్యక్షుడు దోమ మన్మధరావు అధ్యక్షతన సమావేశం ఉంటుందన్నారు. అదే రోజు ఉదయం 10 గంటలకు మూలపేట పోర్టు సందర్శన సన్నాహక సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమానికి పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త ముత్యాలనాయుడు, పార్లమెంట్‌ పరిశీలకుడు కుంబా రవిబాబు, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, రాష్ట్ర బూత్‌ కమిటీ అధ్యక్షుడు సుధాకర్‌ రెడ్డి తదితరులు హాజరు కానున్నారని తెలిపారు. నియోజకవర్గ, మండల బూత్‌ కమిటీ అధ్యక్షులు, పార్టీ మండల శాఖ అధ్యక్షులు హాజరుకావాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement