న్యూస్‌రీల్
కల్తీ కాటేస్తుందికల్తీ సరుకులు పెరిగిపోతున్నాయి. నూనెలను సైతం వదలడం లేదు. –8లో
దాడులు హేయం
టీటీడీ ఛైర్మన్‌ను తొలగించండి
● వైఎస్సార్‌సీపీ మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యలు దారుణం
● టీడీపీ గూండాలు దాడి చేయడం హేయమైన చర్య
● నిరసన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు
కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు
బుధవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2026
పాలన ఘోరం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని చంద్రబాబుకి నిరంతరం భజన చేస్తూ, అబద్దాలనే నిత్యం ప్రచారం చేసే టీవీ చానెల్ యజమాని బీఆ ర్ నాయుడుకు అప్పగించడం దారుణమని వైఎస్సా ర్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. బీఆర్ నాయుడు రాసలీలల వీడియోలు బయటపడిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం నగరంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం మానవహారం చేసి నిరసన ర్యాలీ నిర్వహించారు. బీఆర్ నాయుడు వీడియోలు వైరల్ అయ్యాక వైఎస్సార్‌సీపీ నాయకులు తిరుపతిలో శాంతియుతంగా చేపట్టిన ర్యాలీ ని పోలీసులు అడ్డుకుని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం దారుణమని అన్నారు. శిల్పారామంలో బీఆర్ నాయుడు ఉన్న ఓ హోటల్ వద్ద నిరసన చేయడం తప్పా అని ప్రశ్నించారు. నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసం టీడీపీ గూండాలు వైఎస్సార్‌సీపీ నేతలపై దాడి చేసి అక్రమ కేసులు బనాయించి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలుచేయడం దారుణమన్నారు.
ఇదేనా సూపర్ సిక్స్
బీఆర్ నాయుడు అనైతికంగా ప్రవర్తించి దాడులు చేయించడం, అక్రమ అరెస్టులు చేయడం హేయ మైన చర్యగా భావిస్తున్నామని వైఎస్సార్‌సీపీ డాక్ట ర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. అబద్దాలు చెప్పడం, సమర్థించడం చంద్రబాబునాయుడుకి, బీఆర్‌నాయుడుకి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్‌సిక్స్ అంటే ఖాదర్‌భాషా, ఆదిమూలం, నజీర్, కిరణ్‌రాయల్, అరవల, బీఆర్‌నాయుడుల వీడియోలేనా అని ఎద్దేవా చేశారు. ఇలాంటి అనైతిక చర్యలు చేస్తున్నా వారికి వెనకేసుకుని రావడమే కూటమి నాయకుల లక్ష్యమన్నారు. ప్రజలు కూటమికి అధికారం ఇచ్చింది కక్షలు సాధించుకోడానికి కాదని హితవు పలికారు.
కార్యక్రమంలో ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, వైఎస్సార్ సీపీ టెక్కలి, ఆమదాలవలస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల సమన్వయకర్తలు పేరాడ తిలక్, చింతాడ రవికుమార్, సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ఎంవీ పద్మావతి, తూర్పుకాపు కుల రాష్ట్ర అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, వెలమ కుల రాష్ట్ర అధ్యక్షుడు అంబటి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు, నియోజకవర్గాల పరిశీలకులు ఎన్ని ధనుంజయరావు, కరిమి రాజేశ్వరరావు, పిన్నింటి సాయి, కేవీజీ సత్యనారాయణ, పిల్లల రామకృష్ణ, చల్ల శ్రీనివాసరావు, గొండు కృష్ణమూర్తి, ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు, తమ్మినేని చిరంజీవినాగ్ (నాని), పొన్నాడ రుషి, ముంజేటి కృష్ణమూర్తి, చింతాడ వరుణ్, గేదెల పురుషోత్తం, మార్పు పృథ్వీ, ఎంఏ రఫీ, ముత్తా విజయ్‌కుమార్, రౌతు శంకరరావు, మండవిల్లి రవి, ఎం.ఏ రఫీ, ఖండాపు గోవిందరావు, గుమ్మడి రాంబాబు, సనపల నారాయణరావు, యజ్జల గురుమూర్తి, గంట్యాడ రమేష్, రాజాపు అప్పన్న, తంగుడు నాగేశ్వరరావు, సీపాన మహేంద్ర, పి.సుగుణారెడ్డి, టి.కామేశ్వరి, అంధవరపు సురేష్‌లతో పాటు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నాయకులు భారీగా పాల్గొన్నారు.


