ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలి

Mar 24 2026 6:53 AM | Updated on Mar 24 2026 6:53 AM

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఓటర్ల జాబితాపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. నగరంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో వైఎస్సార్‌సీపీ బూత్‌ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో బూత్‌ కమిటీ విభాగం విస్త్రృత స్థాయి సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్‌ మాట్లాడుతూ బాధ్యతగా వ్యవహరిస్తేనే విజయం మన సొంతమవుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పరిశీలకుడు కుంబా రవిబాబు మాట్లాడుతూ బూత్‌ లెవెల్‌ కమిటీలు చాలా జాగ్రత్తగా పనిచేయాలని, లేకుంటే తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఓటర్ల జాబితాపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించడం అధికార పార్టీ నాయకులకు చాలా సులువని, అధికారులంతా వారికే సహకరిస్తారు కాబట్టి తొలగింపు పెద్ద పని కాదన్నారు. కాబట్టి వైఎస్సార్‌సీపీ బూత్‌ కమిటీలు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ బూడి ముత్యాలనాయుడు, జెడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ, బూత్‌ కమిటీల జిల్లా అధ్యక్షుడు దోమ మన్మథరావు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, నియోజకవర్గ సమన్వయకర్తలు పేరాడ తిలక్‌, చింతాడ రవికుమార్‌, సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, కళింగ వైశ్యకుల రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, అంబటి శ్రీనివాస్‌రావు, కరిమి రాజేశ్వరరావు, చల్ల శ్రీను, నర్తు నరేంద్రయాదవ్‌, చల్ల శ్రీను, మూకళ్ల తాతబాబు, బొడ్డేపల్లి రమేష్‌, పూర్ణసాగర్‌, రవిచంద్ర, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement