● ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్
● పీజీఆర్‌ఎస్‌లో 149 అర్జీలు స్వీకరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజల నుంచి వచ్చే అర్జీల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ అధికారులను ఆదేశించారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)లో 149 అర్జీలు స్వీకరించారు. ప్రధానంగా రెవెన్యూ శాఖ 30, పంచాయతీ రాజ్ 17, వ్యవసాయ శాఖ 16, పేదరిక నిర్మూలన సంస్థ 13, మున్సిపల్ కార్పొరేషన్ 11, ఏపీఈపీడీసీఎల్ 11, సర్వే 9, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ 5, రూరల్ డవలప్‌మెంట్ 5, అటవీ శాఖ 2, ఆర్‌డబ్ల్యూఎస్ 5 తదితర శాఖల నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు పద్మావతి, జి.జయదేవి తదితరులు పాల్గొన్నారు.
వినతులు పరిశీలిస్తే...
● ఏనేటి కోండ్స్ కులాన్ని ఎస్టీ కులంలో చేర్చారని.. అందువలన తమకు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రంను రెవెన్యూ అధికారులు అందజేయాలని కోరుతూ విద్యార్థులు, యువత పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందజేశారు. 20 ఏళ్లుగా ఈ కులానికి ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయుడం లేదని తెలిపారు. దీనివలన యువత ఉద్యోగ, ఉపాధికి దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఫిర్యాదు చేయడానికి వచ్చినవారిలో ఒక విద్యార్థిని మూర్చపోయింది.
● తనకు కళాకారుల పింఛన్ పునరుద్ధరించాలని సరుబుజ్జిలి మండలంలోని పెద్ద సవలాపురం గ్రామ పంచాయతీకి చెందిన కోరాడ అప్పారావు కోరారు.
● శ్రీకాకుళం మండలం రాగోలు గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ రిజర్వు ప్రాంతాలు, లే అవుట్ రిజర్వు ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని పూజారి నాగేశ్వరరావు కోరారు.
● బీసీ, ఎస్టీ, ఎస్టీ హక్కుల చట్టాలను ప్రభుత్వ అధికారులు కఠినంగా అమలు చేయాలని, అందరికీ సామాజిక న్యాయం దక్కాలని భారత్ చైతన్య యువజన పార్టీ ప్రతినిధులు పీజీఆర్‌ఎస్‌లో వినతి పత్రంను అందజేశారు.


