మందస: మండలంలోని హరిపురం గ్రామ పెద్దవీధికి చెందిన పొట్టి శాంతి ఇంట్లో ఇటీవల 20 గ్రాముల బంగారం దొంగతనం జరిగింది. ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కేసుని విచారణ చేసిన పోలీసులు నిందుతుడిని సోమవారం పట్టుకున్నారు. నిందితుడు ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడికి చెందిన వ్యక్తిగా నిర్ధారించారు. నిందితుడు ఉమాకాంత్ బిస్వల్(శంకర్) హరిపురంలోని శ్రీలక్ష్మీ స్వీట్ షాప్‌లో కూలీపని చేసుకుంటున్నాడు. అదే షాపులో పొట్టి శాంతి కూడా పని చేస్తుండగా, ప్రతిరోజు మాదిరిగానే ఇంటికి తాళం వేసి తన హ్యాండ్ బ్యాగులో వేసుకొని షాపునకు వచ్చింది. నిందితుడు శంకర్ ఆమె బ్యాగ్‌లో ఉన్న తాళం చెవిని తీసి శాంతి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను పట్టపగలే దొంగలించాడు. దీనిపై ఆమె ఈనెల 15వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందుతుడిని పట్టుకున్నారు. సీఐ ఎం.తిరుపతిరావు, ఎస్‌ఐ కృష్ణప్రసాద్ కేసు నమోదు చేసి సోంపేట కోర్టుకు తరలించారు.


