శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక (గ్రీవెన్సు)నకు బాధితుల నుంచి 55 ఫిర్యాదులందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఫిర్యాదులు స్వీకరించి బాధితులకు సకాలంలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
కోత కోసేశారు
తమ వరిపంట పొలాన్ని గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కోత కోసేశారని, ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సంతబొమ్మాళి మండలం కొల్లిపాడుకు చెందిన జి.ద్రౌపది తరపున ఆమె కుమారుడు, వికలాంగుడైన మురళి ఎస్పీ గ్రీవెన్సులో సోమవారం ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.


