పోర్టు సభ విజయవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

పోర్టు సభ విజయవంతం చేయండి

Mar 18 2026 7:44 AM | Updated on Mar 18 2026 7:44 AM

● వైఎస్సార్‌ సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్‌

సంతబొమ్మాళి: కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండే ళ్లు కావస్తున్నా మూలపేట పోర్టు నిర్మాణం మొద టి దశ కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహి స్తున్న తీరుకు నిరసనగా ఈ నెల 30న నౌపడలో నిర్వహించనున్న సభను విజయవంతం చేయాల ని వైఎస్సార్‌ సీపీ టెక్కలి ఇన్‌చార్జి పేరాడ తిలక్‌ కోరారు. మండలంలోని నౌపడలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఈ ప్రాంత చిరకాల స్వప్నమైన మూలపేట పోర్టును 75శాతం పూర్తి చేసినా, కూటమి ప్రభుత్వం మిగిలిన పనులు చే యకుండా కాలక్షేపం చేస్తుందని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి విఽఘాతకులుగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, అచ్చెన్నాయుడు మిగిలిపోయారని దుయ్యబట్టా రు. మూలపేట పోర్టుపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై ఉత్తరాంధ్ర సీనియర్‌ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు అన్ని విభాగాల నాయకులు ఈ నెల 30న మూలపేట పోర్టు పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తారని తెలిపారు. ఈ పర్యటనలో వాస్తవ పరిస్థితి తెలుసుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి, ప్రజల తరఫున పోరాటం చేసే బాధ్యతను తీసుకుంటామని అన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో మూలపేట పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసి ల్యాండ్‌ ఎంక్విజేషన్‌ చేసి నిర్వాసితులకు అనువైన పునరావాస కాలనీకి భూములు కేటాయించారని, పోర్టు రోడ్‌ నిర్మాణం తదితర పనులు 75 శాతం పూర్తి చేశా రని వివరించారు. కూటమి ప్రభుత్వం కనీసం నిర్వాసిత కాలనీలో కనీస వసతులు కల్పించకుండా నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. టీడీపీ నాయకులకు ప్రత్యేక ప్యాకేజీ, యూత్‌ ప్యాకేజీ ఇచ్చి వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులకు సామాన్య ప్రజలకు, రైతులకు, పరిహారం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రోడ్డుకు ఇరువైపులా భూములు తీసుకుంటున్నారనే ప్రచారంపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఆయనతో పాటు వైఎస్సార్‌సీపీ మండల పార్టీ అఽధ్యక్షుడు బి.మోహనరెడ్డి, నాయకులు పి.రవికుమార్‌ రెడ్డి, నక్క భీమారావు, సత్తారు సత్యం, తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement