శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని ఆర్ష, సాహిత్య, ఆధ్యాత్మిక సేవా సంస్థ ఉపనిషన్మందిరం ఏర్పడి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 19వ తేదీ నుంచి వజ్రోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు గుమ్మా నగేష్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం కరపత్రాలు ఆవిష్కరించారు. పరాభవ నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది సందర్భంగా సాయంత్రం 6 గంటలకు కోదండ రామాలయంలో ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త తెన్నేటి విక్రమ్ శర్మచే పంచాంగ శ్రవణం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ప్రముఖ పండితులు రామాయణంలోని వివిధ ఘట్టాలను వివరిస్తూ ప్రసంగించనున్నారని తెలిపారు. ఏప్రిల్ 2వ తేదీన శ్రీరామ దర్బార్ నిర్వహిస్తున్నామని, కవి పండితులు ఆరోజు శ్రీరాముల వారిని కీర్తిస్తూ పద్య, గద్య భక్తి గీతాలు ఆలపించనున్నారని పేర్కొన్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి శ్రీమద్రామాయణ ప్రసంగాలు నిర్వహిస్తున్నామని ఆధ్యాత్మిక ప్రియులు, సాహితీవేత్తలు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో మందిరం ప్రతినిధులు పి.పతంజలి శాస్త్రి, నిష్టల నరసింహమూర్తి, కామేశ్వరరావు, డీజీ పట్నాయక్, తెన్నేటి విక్రమ్ శర్మ, జంధ్యాల శరత్ బాబు, బాపయ్య పంతులు, ఈశ్వర సుబ్రహ్మణ్య శర్మ, రంగుడు ప్రసాదరావు, గుహానంద్ పాల్గొన్నారు.
మద్యం తాగి కుర్చీలు ధ్వంసం
Mar 18 2026 7:36 AM | Updated on Mar 18 2026 7:36 AM
మద్యం తాగి కుర్చీలు ధ్వంసం
మందస: మండలంలోని అంబుగాం పంచాయతీ పరిధిలో ప్రజలు విశ్రాంతి తీసుకునేందుకు పంచాయతీ నిధులతో 8 సిమెంట్ కూర్చీలను ఇటీవల ఏర్పాటు చేశారు. అయితే వాటిలో 3 కుర్చీలను అంబుగాం గ్రామానికి చెందిన రెళ్ల ఈశ్వరరావు అనే వ్యక్తి సోమవారం మద్యం సేవించి ధ్వంసం చేసినట్లు సర్పంచ్ టి.వెంకమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అడిగిన వారిని అసభ్య పదజాలంతో దూషించాడని మండిపడ్డారు. ఉన్నతాధికారులు స్పందించి అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఉపనిషన్మందిరం
వజ్రోత్సవ వేడుకలు
Advertisement
Advertisement


