శ్రీకాకుళం: ఆమదాలవలస పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో దానేటి శ్రీధర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన వాటర్ ట్యాంకర్‌ను ఎమ్మెల్యే కూన రవికుమార్, వైద్యుడు దానేటి శ్రీధర్‌తో కలిసి ప్రారంభించారు. సామాజిక సేవలో భాగంగా డాక్టర్ దానేటి శ్రీధర్ చారిటబుల్ ట్రస్ట్ ముందుకొచ్చి ట్యాంకర్‌ను అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ దానేటి శ్రీధర్ మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన సేవలు అందించడంలో తమ ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. వేసవికాలంలో పట్టణ ప్రజలకు తాగునీటి సమస్యను కొంతవరకై నా తగ్గించేందుకు ఈ ట్యాంకర్ ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తమ్మినేని గీతాసాగర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్‌పర్సన్ కూన వెంకట రాజ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి తదితరులు పాల్గొన్నారు.


