● గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని సర్పంచ్ విన్నపం
● సొంత నిధులు రూ.3 లక్షలు ఇస్తానని ఆఫర్
● నీటి సదుపాయం కూడా కల్పిస్తానని హామీ
రైలు కిందపడి వ్యక్తి మృతి
పాతపట్నం: పాతపట్నం రైల్వేస్టేషన్ సమీపంలోని ప్రహారాజపాలేం గ్రామ బ్రెడ్స్ కార్యాలయం ఎదురుగా ప్రమాదవశాత్తు గుణుపూర్–పూరీ రైలు కిందపడి ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లా సింగపూర్ గ్రామానికి చెందిన బిభిషాణ్ మిషాల్ (29) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. సోమవారం ఉదయం గుణుపూర్ నుంచి పూరీ వెళ్తున్న రైలు ప్రహరాజపాలేం సమీపంలోని బ్రెడ్స్ కార్యాలయం ఎదురుగా వచ్చేసరికి, బిభిషాణ్ మిషాల్ దురదృష్టావశాత్తు రైలుకింద పడిపోయాడు. దీంతో రైల్వే సిబ్బంది పలాస జీఆర్పీ పోలీసులకు తెలియజేశారు. రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వద్దనున్న ఓటర్ కార్డు ఆధారంగా ఒడిశాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశామని జీఆర్పీ ఎస్‌ఐ కోటేశ్వరరావు తెలిపారు.
ఆవేదనతో ఆఫర్
ఐదు సంవత్సరాలు సర్పంచ్‌గా పని చేసిన సమయంలో ఈ నాలుగు రోడ్లు బాగు చేయించలేకపోయాను. ఎక్కువ నిధులతో కూడుకున్న పనులు కాబట్టి నేను చేయడానికి అవకాశం లేదు. రోడ్లు బాగు చేయాలని పలువురు పాలకులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. దీంతో తీవ్రంగా ఆవేదన చెంది అధికారులకు ఈ ఆఫర్ ఇవ్వడం జరిగింది.
– బోర సింహాద్రి నాయుడు, సర్పంచ్, గురండి గ్రామం
నిర్లక్ష్యం తగదు
పాలకులు, అధికారులు గురండి గ్రామంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామానికి వచ్చిన నాలుగు రోడ్లు బాగులేకపోవడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్లు బాగు చేయాలి.
– ఎ.రాఘవ, గురండి గ్రామం
వర్షం కురిస్తే నడవలేని పరిస్థితి
వర్షం కురిసినట్లయితే నేరడి నుంచి గురండికి వెళ్లే రోడ్డు, దాశరథీపురం నుంచి గురండి వెళ్లే రోడ్లు బురదమయం అవుతున్నాయి. రోడ్డ మీద గోతులు ఉన్నందున నడవ లేని దుస్థితి నెలకొంది. కనీసం వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నాం. ఇంతవరకు మట్టి రోడ్లుతో ఉన్నాయి.. కనీసం గ్రావెల్ రోడ్లుగా మార్చకపోవడం దారుణం.
– ముంజేటి వెంకటరమణ, గురండి గ్రామం
కొత్తూరు:ప్రస్తుత కాలంలో చిన్నపని చేయాలన్నా.. నిధులు లేవని సాకులు చెప్పే నాయకులు ఎక్కువ. కానీ మండలంలోని గురండి గ్రామ పంచాయతీ సర్పంచ్ బోర సింహాద్రి నాయుడు మాత్రం అందుకు భిన్నం. గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా మారి ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన ఆయన చలించిపోయాడు. దీంతో తమ గ్రామానికి రహదారి నిర్మాణానికి ప్రభుత్వం ముందుకొస్తే తాను కూడా రూ.3 లక్షలు సాయం అందజేస్తానని అధికారులకు తెలిపాడు.
ఇదీ విషయం..
విద్యావంతుడైన బోర సింహాద్రి నాయుడు పంచాయతీని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో 2021లో సర్పంచ్‌గా పోటీచేసి విజయం సాధించాడు. అనంతరం పంచాయతీలో అభివృద్ధి పనులు చేపట్టాలని సంకల్పించాడు. అయితే గ్రామానికి వచ్చే నేరడి– గురండి, దాశరాథిపురం–గురండి, కలిగాం రోడ్డు నుంచి గ్రామ సచివాలయం రోడ్డు, కలిగాం రోడ్డు కూడలి నుంచి గురండి రోడ్లను నిర్మించడంలో అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యహరించారు. సుమారు దశాబ్ధ కాలంగా ఈ రోడ్లు బాగు చేయకపోవడంతో పూర్తిగా పాడైపోయాయి. వర్షాలు కురిస్తే బురదమయం అయ్యేవి. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు సర్పంచ్ వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదు. దీంతో మరో 17 రోజుల్లో తన పదవీ కాలం పూర్తవ్వనున్న నేపథ్యంలో అధికారులకు రోడ్డు నిర్మాణంపై మరోసారి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రోడ్డు పనులు చేపడితే తన సొంత నిధులు రూ.3 లక్షలు అందజేస్తానని తెలిపారు. దీంతో పాటు సొంత ట్యాంకర్లతో ఉచితంగా నీటి సరఫరా చేయడం జరుగుతుందని ప్రకటించారు. అయితే ఈ పనులను తన పదవీ కాలం పూర్తయ్యేలోగా చేపట్టాలని కండీషన్ పెట్టారు. కానీ ఇంతవరకు అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం గమనార్హం
ఉండ్రుకుడియా గెడ్డలో వ్యక్తి మృతి
వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలోని ఉండ్రికుడియా గ్రామంలో అర్‌అండ్‌బీ కల్వర్టు పక్కనే ఉన్న గెడ్డలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గెడ్డలో ఒక మృతదేహం సోమవారం స్థానికులకు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తక్షణమే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతి చెందిన వ్యక్తి పలాస మండలంలోని లొత్తూరు పంచాయతీ చినపరియా గ్రామానికి చెందిన సవర భాస్కరరావు(36)గా గుర్తించారు. మృతుడు తన భార్య సవర భారతి, ఇద్దరు పిల్లలలో కలిసి కాశీబుగ్గలోని ఒక అద్దె ఇంట్లో నివాసముంటూ స్థానిక జీడి పరిశ్రమలో పని చేస్తున్నాడు. అయితే ఈ నెల 14వ తేదీన మధ్యాహ్న సమయంలో భాస్కరరావు తన మామయ్య ఆరోగ్యం బాగులేదని తెలిసి తన ద్విచక్ర వాహనంపై లొత్తూరు వెళ్లాడు. అనంతరం రాత్రి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఉండ్రికుడియా కల్వర్టు వద్ద ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంతో పాటు పడిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. భర్త ఇంటికి చేరకపోవడంతో భార్య తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ భాస్కరరావు అచూకీ లభ్యం కాకపోవడంతో, ఇంటికి వస్తాడులే అనుకున్న తరుణంలో మరణవార్త తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. పోలీసులు మృతదేహంతో పాటు ద్విచక్ర వాహనాన్ని పైకి తీసి శవపంచనామ చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పలాస ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. కాగా భార్య భారతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు హెచ్‌సీ వైకుంఠరావు తెలిపారు.


