కూటమి ప్రభుత్వం పూర్తిగా సంక్షేమాన్ని గాలికి వదిలేసింది. చివరకు ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు సైతం చెల్లించడం లేదు. దీంతో విద్యార్థులే ఒకరికొకరు క్షవరం చేసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. హిరమండలం మండలం మర్రిగూడ గిరిజన గ్రామంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఒకరుకొకరు క్షవరం చేసుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై మర్రిగూడ ఆశ్రమ పాఠశాల వార్డెన్ బాలరాజు వద్ద ప్రస్తావించగా ప్రతి వారం బార్బర్‌ను తెప్పించి విద్యార్థులకు క్షవరం చేయిస్తున్నామని తెలిపారు. – హిరమండలం


