శ్రీకాకుళం కల్చరల్: నాలుగు నెలలుగా జీతాలు, పెన్షన్లు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలియజేస్తూ జిల్లా గ్రంథాలయ సంస్థ పెన్షనర్లు ముఖ్యమంత్రి, మంత్రులు, రాష్ట్ర అధికారులకు లేఖలు, ఈమెయిల్స్ పంపుతున్నారు. తక్షణం అదనపు గ్రాంటు విడుదల చేసి సంక్షోభం నుంచి గట్టెక్కించాలని కోరుతున్నారు. మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడిందని, వెంటనే పెన్షన్ గ్రాంట్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మహిళలకు ఉపాధి శిక్షణ
ఎచ్చెర్ల: స్థానిక నందమూరి తారకరామారావు నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారిత కేంద్రం(మహిళా ప్రాంగణం)లో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ(గుంటూరు) సౌజన్యంతో మహిళలకు ఉపాధి శిక్షణ ఇస్తున్నట్లు మేనేజర్ రబీకా సామ్యూల్ ఒక ప్రకటనలో తెలిపారు. రెండు నెలల శిక్షణ గల అసిస్టెంట్ బ్యూటీ థెరఫిస్ట్, 45 రోజుల శిక్షణ గల హ్యండ్ ఎంబ్రాయిడర్ 8 వ తరగతి విద్యార్హత, మూడు నెలల శిక్షణ గల డొమెస్టిక్ డేటాఎంట్రీ ఆపరేటర్‌కు పదో తరగతి చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. 18 నుంచి 45 ఏళ్ల లోపు మహిళలు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు.
స్టూడెంట్ వెల్ఫేర్ డీన్‌గా సింహాచలం
ఎచ్చెర్ల : స్థానిక ట్రిపుల్ ఐటీ కళాశాలలో స్టూడెంట్ వెల్ఫేర్(బాయ్స్) నూతన డీన్‌గా సింహాచలం శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన్ను వర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ అమరేంద్ర కుమార్, పరిపాలనాధికారి ముని రామకృష్ణ, డీన్ శివరామకృష్ణ, వాసు సాగర్, సిబ్బంది అభినందించారు.


