ఒడియా విద్యార్థుల అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

ఒడియా విద్యార్థుల అభివృద్ధికి కృషి

Jan 2 2026 12:26 PM | Updated on Jan 2 2026 12:26 PM

ఒడియా

ఒడియా విద్యార్థుల అభివృద్ధికి కృషి

ఒడియా విద్యార్థుల అభివృద్ధికి కృషి మాజీ సైనికుల వెబ్‌సైట్‌, క్యాలెండర్‌ ఆవిష్కరణ నేత్రదానం స్ఫూర్తిదాయకం రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు గంజాయితో ఆరుగురు అరెస్టు

ఇచ్ఛాపురం: ఆంధ్రప్రదేశ్‌లో ఒడియా మైనారి టీ విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తామని ఒడి యా లింగ్విస్టిక్‌ మైనారిటీ సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ పాడీ అన్నారు. ఇచ్ఛాపురం జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు సమీపంలో ఆంధ్రప్రదేశ్‌ ఒడియా టీచర్స్‌ అసోసియేషన్‌ (అపో టా) ప్యాకెట్‌ క్యాలెండర్‌ను గురువారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఒడియా డీఐ దుర్గాప్రసాద్‌ చౌదరి, ఆపోటా రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్‌ పాఢీ, ప్రధాన కార్యదర్శి బృందావన్‌ దొళాయి, ఒడియా సంఘం పెద్దలు రఘునాథ్‌ గౌడో తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం కల్చరల్‌ : మాజీ సైనికుల సంక్షేమ సంఘం వెబ్‌సైట్‌, క్యాలెండర్‌ను ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు గురువారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం, సభ్యులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం కల్చరల్‌: జిల్లా కేంద్రంలోని ఏడు రోడ్ల జంక్షన్‌ ప్రాంతంలో నివా సముంటున్న పట్నాల శ్యామలాంబ(86) మృతిచెందడంతో ఆమె నేత్రాల ను దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకువచ్చారు. మగటపల్లి కళ్యాణ్‌ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియ న్‌ పూతి సుజాత, పి.సుమతి ద్వారా ఆమె కార్నియాలు సేకరించి విశాఖపట్నం ఎల్‌.వి.ప్రసాద్‌ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. నేత్రదానం చేయాలనుకునే వారు 78426 99321 నంబరుకు సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.

వజ్రపుకొత్తూరు రూరల్‌ : పలాస మండలం బొడ్డపాడు జంక్షన్‌ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యా యి. పలాస మున్సిపాలిటీ పరిధి రామకృష్ణా పురం గ్రామానికి చెందిన లండ శశికుమార్‌ బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో శశికుమార్‌ తలకు తీవ్ర గాయాలు కావడంతో పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం నిమిత్తం శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించారు. ద్విచక్ర వాహన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిందా.. లేక అదుపు తప్పి ప్రమాదం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.

శ్రీకాకుళం క్రైమ్‌ : కలెక్టరేట్‌కు వెళ్లే దారిలో అపార్ట్‌మెంట్స్‌ వెనుక భాగంలో 2.4 కిలోల గంజాయితో ఉన్న ఆరుగురు యువకులను గురువారం పోలీసులు పట్టుకున్నారు. రూరల్‌ సీఐ పైడపునాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. పక్కా సమాచారం మేరకు ఎస్‌ఐ ఎం.హరికృష్ణ సిబ్బందితో మాటు వేసి భానుగురి చంద్రశేఖర్‌, కిల్లంశెట్టి నిఖిల్‌, పొన్నాడ కిషోర్‌, కుందు గోపాల్‌, కొన్న రాందేవ్‌, దండి వేణులను పట్టుకున్నారు. వీరిన విచారించగా ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌ నుంచి గంజాయిని అక్రమంగా తీసుకొచ్చి పరస్పరం పంచుకుంటున్నట్లు నిర్ధారించారు. గంజాయిని సీజ్‌ చేసి యువకులను కోర్టులో హాజరుపర్చగా.. జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో జిల్లా జైలుకు తరలించారు.

ఒడియా విద్యార్థుల అభివృద్ధికి కృషి   1
1/3

ఒడియా విద్యార్థుల అభివృద్ధికి కృషి

ఒడియా విద్యార్థుల అభివృద్ధికి కృషి   2
2/3

ఒడియా విద్యార్థుల అభివృద్ధికి కృషి

ఒడియా విద్యార్థుల అభివృద్ధికి కృషి   3
3/3

ఒడియా విద్యార్థుల అభివృద్ధికి కృషి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement