సిక్కోలుకు మీరు చేసింది సున్నా! | - | Sakshi
Sakshi News home page

సిక్కోలుకు మీరు చేసింది సున్నా!

Dec 14 2025 12:11 PM | Updated on Dec 14 2025 12:11 PM

సిక్క

సిక్కోలుకు మీరు చేసింది సున్నా!

సిక్కోలుకు మీరు చేసింది సున్నా! ● మాయ మాటలు తప్ప మంచి ఏముంది? ● విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

● మాయ మాటలు తప్ప మంచి ఏముంది? ● విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ‘ప్రజలు మీకు 50 ఏళ్ల అధికారం ఇచ్చారా..! ఐదేళ్లే కదా అధికారం ఇస్తారు.. తాజా పదవీకాలంలో అప్పుడే ఏడాదిన్నర కాలం పూర్తయింది. మీ ఇంట్రస్టులు మీకున్నాయి తప్ప ఏ ఒక్క అభివృద్ధి పనీ చేపట్టలేదు.. శ్రీకాకుళం జిల్లాకు ఏం చేశారో చెప్పాలి’ అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సీఎం చంద్ర బాబును సూటిగా ప్రశ్నించారు. శ్రీకాకుళంలోని ఓ హోటల్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో వంశధార ప్రాజెక్టు పనులు కనీసం మొదలుపెట్టగలిగారా..? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో అప్పులు..

ప్రజలకు తిప్పలు..

ఏడాదిన్నరలో రూ.2.65 లక్షల కోట్లు అప్పు చేశారని ధర్మాన ధ్వజమెత్తారు. ప్రతి ఏటా రూ.2లక్షల కోట్లు బడ్జెట్‌ ప్రొవిజన్‌ ఉందని, అంటే రెండేళ్లలో రూ.4 లక్షల కోట్లు, అప్పు చేసిన రూ.2.65 లక్షల కోట్లు కలిసి మొత్తం రూ.6.65 లక్షల కోట్లలో శ్రీకాకుళం జిల్లాలో మీరు చేసిన కేపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కనీసం రూ.500 కోట్లు చూపించగలరా? అని ప్రశ్నించారు. ఆమదాలవలస రోడ్డు ఆగిపోయిందని విమర్శలు చేశారే తప్ప రూ.40 కోట్లు ఇవ్వలేకపోయారన్నారు. ఎల్లోమీడియాలో ఎన్నో వార్తలు రాసినా కనీసం పేమెంట్‌ ఇవ్వలేకపోవడం దారుణమన్నారు. ఇప్పటివరకు గార బ్రిడ్జి పూర్తి కాలేదని, సమీకృత కలెక్టరేట్‌ పూర్తి కాలేదని మండిపడ్డారు. ఒక్క నిర్మాణమైనా ప్రారంభించి పూర్తి చేయగలిగారా? అని ప్రశ్నించారు. మాయమాటలు చెప్పడం మినహా సంస్కరణలు మీకు చేతగాదన్నారు. భూసర్వే వల్ల గ్రామాల్లో వివాదాలతో చితికిపోతున్న అనేక కుటుంబాలకు మేలు జరిగిందన్నారు. జగన్‌ అధికారంలో ఉంటే సర్వే పూర్తయ్యేదన్నారు. సర్వే రాళ్లపై జగన్‌ బొమ్మ పెడితే ఆ భూమి తీసుకుంటారని తప్పుడు ప్రచారం చేసి ఓట్లు సంపాదించుకున్నారే తప్ప ఒకరి భూమి మరొకరు తీసుకోవడం రాష్ట్రపతికి గానీ, గవర్నర్‌కు గానీ ఉండదన్నారు. భారత రాజ్యాంగంలో ఆ అవకాశమే లేదని స్పష్టం చేశారు.

కామెంట్‌ బాక్స్‌

పేదలను కొట్టి పెద్దలకు పంచడమే నైజంగా

చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోంది.

2020లో జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి తాను

తీసుకొచ్చిన భూసంస్కరణల వల్లే పేదలకు మేలు జరిగింది.

రాష్ట్రంలో 1977 తర్వాత రైతులకు మేలు జరిగింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే.

ఉద్యోగులతో తప్పుడు పనులు చేయించే ప్రయత్నం చేస్తుంటే.. వారంతా మూకుమ్మడి సెలవుకు సిద్ధంగా ఉన్నారు.

వైఎస్‌ జగన్‌ హయాంలో రూ.12వేల కోట్లు పెట్టి భూమి కొనుగోలు చేసి 30 లక్షల మందికి పట్టాలిచ్చారు. ఆ పట్టాల్ని సైతం ఎలా అమ్ముకోవాలో అన్న ఆలోచన తప్ప పేదలకు న్యాయం చేయాలన్న ఉద్దేశం ఏ ఒక్క కూటమి నాయకులకూ లేదు.

బ్రిటీషర్లు వెళ్లిన తర్వాత కాలంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూసర్వే చేసిన ఘనత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానిదే..

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిన్నర తర్వాత రెవెన్యూశాఖపై చంద్రబాబు సమీక్ష

నిర్వహించడం దారుణం.

18 నెలల పాలనలో పేదల కోసం కనీసం ఎకరా భూమి కూడా కొనుగోలు చేయలేని దుస్థితి

చంద్రబాబు ప్రభుత్వానిది.

తహశీల్దార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలన్నీ

ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఏ కార్యాలయానికి వెళ్లినా.. మీ ఎమ్మెల్యేకు చెప్పారా? లేదా? అక్కడ డబ్బులిచ్చుకుని రా..

అన్న పరిస్థితి ఏర్పడింది.

సిక్కోలుకు మీరు చేసింది సున్నా!1
1/3

సిక్కోలుకు మీరు చేసింది సున్నా!

సిక్కోలుకు మీరు చేసింది సున్నా!2
2/3

సిక్కోలుకు మీరు చేసింది సున్నా!

సిక్కోలుకు మీరు చేసింది సున్నా!3
3/3

సిక్కోలుకు మీరు చేసింది సున్నా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement