16 నుంచి తిరుప్పావై ప్రవచనాలు | - | Sakshi
Sakshi News home page

16 నుంచి తిరుప్పావై ప్రవచనాలు

Dec 14 2025 12:11 PM | Updated on Dec 14 2025 12:11 PM

16 నుంచి తిరుప్పావై ప్రవచనాలు

16 నుంచి తిరుప్పావై ప్రవచనాలు

16 నుంచి తిరుప్పావై ప్రవచనాలు లోక్‌ అదాలత్‌లో 6508 కేసులు రాజీ చెస్‌ శిక్షణ శిబిరం ప్రారంభం పొదల్లో నవజాత శిశువు ● బీ పాజిటివ్‌కు బదులుగా

గార: శ్రీకూర్మంలోని కూర్మనాథాలయంలో ఈ నెల 16 నుంచి తిరుప్పావై ప్రవచనా లు ప్రారంభమవుతా యని స్థానాచార్యులు శ్రీభాష్యం పద్మనాభా చార్యులు శనివారం తెలిపారు. తిరుమల తిరు పతి దేవస్థానాలు ఆధ్వర్యంలో దేశమంతటా 240 దేవాలయాల్లో, మన జిల్లాలో శ్రీకూర్మనాథాలయం, వేణుగోపాలస్వామి ఆలయం, శ్రీకాకుళం కోదండ రామాలయాల్లో ప్రవచనాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ నెల 16న నెల గంట కార్యక్రమంతో పాటు, తిరుప్పావై ప్రత్యేక పూజలుంటాయని తెలిపారు. జనవరి 14 వరకు ప్రతిరోజు సాయంత్రం బేడా మంటపంలో ప్రవచనాలు జరుగుతాయన్నారు. భక్తులంతా పాల్గొనాలని కోరారు.

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 6508 కేసులను రాజీ చేసినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్‌ అహ్మద్‌ మౌలానా వెల్లడించారు. ఇందులో సివిల్‌ కేసులు 202, క్రిమినల్‌ కేసులు 6253, ప్రీ లిటిగేషన్‌ కేసులు 53 రాజీ అయ్యా యని వివరించారు. వీటితో పాటు హెచ్‌ఎంపీవో కేసులలో భార్యాభర్తలు తిరిగి కలవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

శ్రీకాకుళం న్యూకాలనీ: అంతర్జాతీయ చెస్‌ క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా శ్రీకాకుళంలో ప్రొఫెషనల్‌ చెస్‌ శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినట్లు ఫిడే ఇన్‌స్ట్రక్టర్‌, చీఫ్‌ కోచ్‌ ఎం.రామకృష్ణ పేర్కొన్నారు. శనివారం శ్రీకాకుళం కొత్త రోడ్డులోని సీఎస్‌ఎన్‌ ట్రస్ట్‌ కార్యాలయంలోని చెస్‌ శిక్షణ కేంద్రంలో శిబిరం ప్రారంభించారు. ఆల్‌ ఇండియా చెస్‌ ఫెడరేషన్‌ చెస్‌ ఇన్‌ స్కూల్‌ ట్రైనర్‌ సనపల భీమారావు మెంటర్‌గా వ్యవహరిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమం ప్రతి శని, ఆదివారాల్లో రోజుకు 8 గంటల చొప్పున కొనసాగుతుందని వివరించారు. తొలిరోజు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి పదిమంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ నెల 25 నుంచి 28వ వరకు విశాఖపట్నంలో జరగబోయే ఇంటర్నేషనల్‌ ఫిడే రేటింగ్‌ టోర్నమెంట్‌లో గెలుపే లక్ష్యంగా తర్ఫీదు అందిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో చెస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బగాది కిషోర్‌, జామి రమేష్‌, సంయుక్త కార్యదర్శి వై.ఎస్‌.వి.కుమార్‌, అసోసియేషన్‌ సభ్యులు అభినవ్‌, వసంతరావు, ఆర్బిటర్‌ సైదా బేగం తదితరులు పాల్గొన్నారు.

కవిటి: మండలంలో కవిటి – గొండ్యాలపుట్టుగ రోడ్డు మార్గంలోని కొబ్బరితోటల పొదల్లో శనివారం ఉదయం నవజాత మగ శిశువు మృతదేహం కనిపించింది. వేకువజామున వాకింగ్‌కు వెళ్లే పాదచారులు గుర్తించి విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేశారు. దీంతో ఎస్‌ఐ వి.రవివర్మ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని ఖననం చేశారు.

రిమ్స్‌లో హౌస్‌ సర్జన్‌ నిర్వాకం

ఓ పాజిటివ్‌ రక్తం ఎక్కించిన వైనం

శ్రీకాకుళం: రిమ్స్‌ వైద్య కళాశాలలో శనివారం ఫిమేల్‌ వార్డులో ఓ రోగికి హౌస్‌సర్జన్‌లు బీ పాజిటివ్‌ రక్తానికి బదులుగా ఓ పాజిటివ్‌ రక్తం ఎక్కించడం వివాదాస్పదమైంది. శ్రీకాకుళం రాజీవ్‌ గృహకల్ప కాలనీకి చెందిన అదపాక అలివేలు మూడు రోజుల క్రితం అనారోగ్యంతో రిమ్స్‌లో చేరింది. ఆమెకు రక్తం తక్కువగా ఉండడంతో ఇప్పటికే రెండు యూనిట్ల రక్తం ఎక్కించారు. శనివారం రోగి బంధువులు మూ డో యూనిట్‌ రక్తాన్ని తీసుకొచ్చారు. దీనిని ఎక్కిస్తున్న 5నిమిషాల్లోనే రోగి శరీరంలో తేడా లు కనిపించడంతో రక్తాన్ని పరిశీలించగా వేరొ క రోగి కోసం తీసుకొచ్చిన ఓ పాజిటివ్‌ రక్తాన్ని అలివేలు ఎక్కిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే దానిని తొలగించారు. రోగిని వేరొక వార్డుకు తరలించి ప్రత్యేక చికిత్స అందిస్తున్నా రు. రోగి బంధువులు అలివేలు ఆరోగ్య పరిస్థితి విష మంగా ఉండడంతోనే వేరొక వార్డుకు తరలించారని ఆందోళన చేశారు. సూపరింటెండెంట్‌ ప్రసన్నకుమార్‌, ఆర్‌ఎంఓ సుభాషిణిలు రోగిని పరిశీలించి ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే వేరొక వార్డుకు తరలించామని, కంగారుపడా ల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ ఘటనపై ఆదివారం విచారణ జరిపిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement