గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
టెక్కలి రూరల్: టెక్కలి నుంచి నౌపడ వెళ్లే దారిలో తలగాం సమీపంలో శనివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. టెక్కలి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఇజ్జువరం పంచాయతీ రాజగోపాలపురం గ్రామానికి చెందిన ఇజ్జువరపు అప్పన్న(43) శుక్రవారం రాత్రి పలాసలోని తన బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చే క్రమంలక్ష గ్రామ సమీపంలో రోడ్డు పక్కన నడిచివస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అప్పన్న అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి అనంతరం మార్చురికీ తరలించారు. అప్పన్నకు భార్య పార్వతి, కుమారుడు కార్తీక్, కుమార్తె ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు సీఐ విజయ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


