ఘనంగా భక్త కనకదాసు జయంతి
శ్రీకాకుళం పాతబస్టాండ్ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భక్త కనసాదాసు 516వ జయంతి వేడుకలు శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కనకదాసు నరసింహ స్తోత్రం, రామధ్యాయ మంత్రం, మోహన తరంగిని అనే కవిత్వాలను రచించినట్లు వివరించారు. నలచరిత్ర, హరిభక్తిసార, తదితర రచనలను కన్నడంలో రచించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి జి.ఎ.సూర్యనారాయణ, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.


