అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్య
నందిగాం: తురకలకోట గ్రామ సమీప తోటలో శనివారం ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తురకలకోట గ్రామానికి చెందిన మేఘవరం వెంకటరావు(38) బెంటుగేటు వద్ద పెట్రోల్ బంకులో పనిచేసేవాడు. యజమాని వద్ద రూ.30వేలు అప్పుగా తీసుకున్నాడు. అనంతరం అక్కడ పని మానేశారు. అప్పు తీర్చలేకపోవడంతో యజమాని వేధింపులు భరించలేక శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయాడని, చివరకు తోటలో ఉరివేసుకున్నాడ ని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ మేరకు వెంకటరావు భార్య నీలవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం ఎస్‌ఐ షేక్ మహ్మద్ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


