వైభవోపేతంగా సంకటహర చతుర్ధి
లక్షదీపారాధనలో భక్తులు ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన
కొత్తూరు: మహసింగి గ్రామంలో వరాహలక్ష్మి నృసింహ స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంకగా శనివారం సంకటహర చతుర్ధి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు బాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో స్వయంభూ విగ్రహానికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, వ్రతాలు, హోమాలు జరిపించారు. కోలాటం ప్రదర్శన ఆకట్టుకుంది. సాయంత్రం లక్ష దీపారాధన భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవచనకర్త యాలాల శ్రీనివాసరావు ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సీఐ చింతాడ ప్రసాదరావు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ ఈవో వాసుదేవరావు పాల్గొన్నారు.
వైభవోపేతంగా సంకటహర చతుర్ధి


