బాలుడి కోసం కొనసాగుతున్న గాలింపు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని ఏడు రోడ్ల కూడలి సమీపంలో పాత వంతెన పైనుంచి శుక్రవారం అర్ధరాత్రి నాగావళి నదిలో ఓ బాలుడు దూకేసిన సంగతి తెలిసిందే. గల్లంతైన అలుగోలు సాయి నేతాజి (17) కోసం శనివారం అగ్నిమాపక సహాయాధికా రి శ్రీనుబాబు ఆధ్వర్యంలో రెస్క్యూ, అగ్నిమాపక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. రెండో పట్టణ ఎస్‌ఐ లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాతీపేట శివాలయం వీధిలో నివసిస్తు న్న అలుగోలు ఉమాకోటేశ్వరరావు ఓ యూనివర్సిటీ బస్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కుమారుడు సాయినేతాజీ, కుమార్తె ఉన్నా రు. ఆర్ట్స్ కళాశాల సమీపంలో ఐటీఐ చదువుతున్న సాయినేతాజీ ఇంటికి ఆలస్యంగా రావడాన్ని తండ్రి గమినిస్తుండేవాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 10 గంటలకు బాలుడు రావడంతో తండ్రి మందలించాడు. దీంతో మనస్థాపానికి గురై క్షణికావేశంలో నదిలోకి దూకేశాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ పేర్కొన్నారు.
బాలుడి కోసం కొనసాగుతున్న గాలింపు


