ఘనంగా అయ్యప్పస్వామి అంబలం పూజ
ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణంలో మాజీ స్పీకర్ తమ్మి నేని సీతారాం నివాసంలో ఆయన కుమారుడు చిరంజీవినాగ్ నేతృత్వంలో శనివారం అయ్యప్పస్వామి అంబలం పూజ ఘనంగా నిర్వహించారు. అరటిచెట్లతో అంబులం ఏర్పాటు చేసి అయ్యప్ప, వివిధ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. పురోహి తులు రాజేష్‌శర్మ స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. సీతారాం, వాణమ్మ దంపతులు అయ్యప్పస్వామి ఆలయానికి శాశ్వత విరాళంగా రూ.30వేలను యడ్ల రమణయ్యస్వామి, తంబిస్వామిలకు అందజేశారు. సుమారు 300 మంది అయ్యప్ప భక్తులకు భి క్ష ఏర్పాటు చేశారు. 20 మంది గురుస్వాములు, గురుభవానీలకు సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కాలింగ కుల అధ్యక్షుడు దుప్పల లక్ష్మణరావు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.


