కేజీబీవీ విద్యార్థినికి వైఎస్సార్ సీపీ నేతల పరామర్శ
శ్రీకాకుళం:
రిమ్స్‌లో చికిత్స పొందుతున్న కేజీబీవీ విద్యార్థి ని చిత్తరపు వందనను వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి, నాయకులు శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థి వందన మాట్లాడుతూ ప్రిన్సిపాల్ చిత్రహింసలకు గురుచేస్తూ కులం పేరుతో దూషించిందని, వీటిని తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు వాపోయింది. విద్యార్థిని తల్లి లక్ష్మి మాట్లాడుతూ తన బిడ్డకు జరిగినా అన్యాయంపై ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకునే వరకు న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో రాగోలు మాజీ సర్పంచ్ యడ్ల గురుమూర్తి, రాష్ట్ర ఎస్సీ విభాగం సంయుక్త కార్యదర్శి పెయ్యిల లక్ష్మణరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నీలాపు ముకుందరావు తదితరులు పాల్గొన్నారు.


