12న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు
నరసన్నపేట : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు చేపట్టనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ శుక్రవారం తెలిపారు. ముందుగా అనుకున్న 11వ తేదీ బదులుగా 12న ర్యాలీలు నిర్వహించాలని పార్టీ సమన్వయకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు, ప్రతినిధులకు సూచించారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు.
బీఆర్‌ఏయూలో హెర్బల్ గార్డెన్
ఎచ్చెర్ల : డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ ప్రాంగణంలో పది హెక్టార్లలో సమాజహిత, ఆరోగ్యకరమైన ఔషధ మొక్కలతో కూడిన హెర్బల్ గార్డెన్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ఔషధ, సుగంధ మొక్కల బోర్డు అధికారులు శుక్రవారం పర్యటించారు. క్యాంపస్‌లో అనువైన ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం సెమినార్ హాల్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బోర్డు సీఈవో ఏ.చంద్రశేఖర్ మాట్లాడుతూ ఔషధ మొక్కల పెంపకంతో కాలుష్య రహిత సమాజం సాధ్యమవుతుందన్నారు. గంజాయి వంటి సాగు, వ్యసనాలకు యువతరం దూరంగా ఉండి ప్రయోజనకరమైన మొక్కలు నాటేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బోర్డు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి కె.ప్రదీప్‌కుమార్ మాట్లాడుతూ ఔషధ రంగంలో స్వల్పకాలిక కోర్సులు చదివితే ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో వీసీ కె.ఆర్.రజనీ, రిజిస్ట్రార్ బి.అడ్డయ్య, పూర్వ రిజిస్ట్రార్ పి.సుజాత, అకడమిక్ అఫైర్స్ డీన్ కె.స్వప్నవాహిని, ఆర్‌అండ్‌డీ డీన్ ఎన్.లోకేశ్వరి పాల్గొన్నారు.
ఉప్పు మడుల్లో పోర్టు రోడ్డు
సంతబొమ్మాళి : మూలపేట పోర్టు యాజమాన్యం ఉప్పుమడుల్లో దౌర్జన్యంగా రైల్వేలైన్ కోసం రోడ్డు నిర్మాణం చేపడుతోందంటూ ఎన్.ఎస్.కంపెనీ నిర్వాహకులు, ఉప్పు కార్మికులు శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు. నౌపడ సాల్ట్‌రన్ 1956 ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ పేరిట 65 ఏళ్లుగా 375.64 ఎకరాల్లో ఈ ప్రాంతంలో ఉప్పు సాగు చేస్తున్నామని, ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పరిహారం చెల్లించకుండా ఉప్పుమడులు మీదుగా రైల్వేలైన్ కోసం రోడ్డు నిర్మాణం చేపడుతున్నారని వారంతా వాపోయారు. పనులు ఆపాలని చెప్పినా పట్టించుకోవడం లేదని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
వేతనాలు అందక పస్తులు
టెక్కలి రూరల్: టెక్కలి జిల్లా ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న భద్రతా సిబ్బంది శుక్రవారం నిరసన చేపట్టారు. కాంట్రాక్టర్ మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్ జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
12న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు
12న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు
12న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు
12న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు


