రక్తనమూనాల సేకరణ
గార : జ్వరాలు వ్యాప్తి చెందిన నేపథ్యంలో శాలిహుండం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం విద్యార్థినుల రక్తనమూనాలు శుక్రవారం సేకరించారు. 287 మంది విద్యార్థినులకు గాను 36 మంది సెలవులో ఉండగా, మిగిలిన విద్యార్థుల రక్తనమూనాలు సేకరించి శ్రీకాకుళం రిమ్స్‌కు పంపించారు. ప్రస్తుతం నలుగురు మాత్రమే జ్వరాలతో బాధపడుతున్నారని, ఇంటికి వెళ్లిన వారి సమాచారం రావాల్సి ఉందని గార పీహెచ్‌సీ వైద్యాధికారులు రమ్య, షాలిని తెలిపారు. కాగా, జ్వరాల సమాచారం తెలుసుకున్న ఎంపీపీ గొండు రఘురామ్, సబ్ డివిజనల్ మలేరియా అధికారి ఎస్.అప్పారావు పాఠశాలను సందర్శించి ఆరా తీశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రజిని, సర్పంచ్ కొంక్యాన ఆదినారాయణ, వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీసెల్ విభాగం అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి, చింతల గడ్డెయ్య, సెక్రటరీ సురేష్ పాల్గొన్నారు.


