రేపు జిల్లా స్థాయి సీనియర్ ఫెన్సింగ్ పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి సీనియర్స్ పురుషులు, మహిళల ఫెన్సింగ్ క్రీడాకారుల ఎంపిక పోటీలను ఈ నెల 8న నిర్వహిస్తున్నట్టు జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బలభద్రుని రాజా గురువారం తెలిపారు. శ్రీకాకుళం టౌన్ హాల్ వేదికగా ఉదయం 9 గంటల నుంచి ఎంపికల ప్రక్రియ ప్రారంభమౌతుందని చెప్పారు. 18 ఏళ్లు పైబడి, గతంలో ఫెన్సింగ్ క్రీడలో పాల్గొని అనుభవం కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. క్రీడాకారులకు ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ తప్పనిసరని తెలిపారు. ఆసక్తి ఉన్న, అర్హత గల క్రీడాకారులు పూర్తి వివరాలకు ఎన్‌ఐఎస్ కోచ్ జోగిపాటి వంశీ(7660874844)ని సంప్రదించాలని కోరారు. ఇక్కడ ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 11 నుంచి విజయవాడలో జరిగే ఏపీ రాష్ట్ర స్థాయి సీనియర్స్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్–2025 పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచి పతకాలు సాధించిన క్రీడాకారులు ఈ నెల 15 నుంచి ఢిల్లీ వేదికగా జరిగే జాతీయ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.
ఫెన్సింగ్


