స్కూల్‌గేమ్స్ అండర్–19 విజేత విశాఖ
● రన్నరప్‌తో సరిపెట్టుకున్న ఆతిఽథ్య శ్రీకాకుళం
● తృతీయ స్థానంలో పశ్చిమగోదావరి,
నాల్గో స్థానంలో చిత్తూరు
● నేటి నుంచి బాలికల క్రికెట్ సమరం
శ్రీకాకుళం న్యూకాలనీ: ఏపీ స్కూల్‌గేమ్స్ అండర్–19 బాలుర క్రికెట్ టోర్నీ చాంపియన్‌గా విశాఖపట్నం నిలిచింది. ఉత్కంఠభరితమైన ఫైనల్ పోరులో ఆతిధ్య శ్రీకాకుళం జట్టును సూపర్‌ఓవర్‌లో ఓడించి జయకేతనం ఎగురవేసింది. మూడో స్థానం కోసం జరిగిన మరో కీలక మ్యాచ్‌లో చిత్తూరును పశ్చిమ గోదావరి జట్టు ఓడించింది. శ్రీకాకుళం జిల్లాలో విద్యాశాఖ పరిధిలోని జిల్లా స్కూల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం/ఎచ్చెర్ల/చిలకపాలెం క్రీడామైదానాల వేదికలగా మూడు రోజులపాటు జరిగిన ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ అండర్–19 బాలుర చాంపియన్‌షిప్ పోటీలు బుధవారం సాయంత్రంతో ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన ముగింపు, బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమలో జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో స్టేట్‌మీట్ పరిశీలకులు రాజేష్ గోల(కర్నూలు), ఎస్‌జీఎఫ్ సెక్రటరీ బీవీ రమణ, మహిళా కార్యదర్శి ఆర్.స్వాతి, పీడీ–పీఈటీ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంవీ రమణ, ఎం.ఆనంద్‌కిరణ్, ఎ.డిల్లేశ్వరరావు, బి.లోకేశ్వరరావు, బి.మల్లేశ్వరరావు, జిల్లా ఒలంపిక్ సంఘం సలహాదారు పి.సుందరరావు, ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి, గ్రిగ్స్ సెక్రెటరీ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
ఫైనల్ సాగిందిలా..
స్థానిక కోడి రామ్మూర్తి స్టేడియంలో బుధవారం శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల మధ్య ఫైనల్ జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విశాఖ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. 75 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కి దిగిన శ్రీకాకుళం జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేయడంతో స్కోర్ సమమైంది. ఫలితం తేల్చేందుకు మ్యాచ్ అంపైర్లు సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీకాకుళం జిల్లా జట్టు 7 పరుగులు చేసింది. 8 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేసిన విశాఖపట్నం జట్టు మూడు బంతుల్లో లక్ష్యాన్ని ఛేదించింది.
నేటి నుంచి మహిళా పోరు
ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ అండర్–19 బాలికల చాంపియన్‌షిప్–2025–26 పోటీలు గురువారం నుంచి మొదలుకానున్నాయి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో మైదానాలతోపాటు అవసరమైతే ఎచ్చెర్లలోని వెంకటేశ్వర, చిలకపాలెంలోని శ్రీ శివానీ ఇంజనీరింగ్ కళాశాలల మైదానాలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.
స్కూల్‌గేమ్స్ అండర్–19 విజేత విశాఖ


