కొడితే కొట్టాలిరా.. సిక్స్‌ కొట్టాలి..! | - | Sakshi
Sakshi News home page

కొడితే కొట్టాలిరా.. సిక్స్‌ కొట్టాలి..!

Nov 6 2025 7:28 AM | Updated on Nov 6 2025 7:28 AM

కొడిత

కొడితే కొట్టాలిరా.. సిక్స్‌ కొట్టాలి..!

ఫ్యూచర్‌ క్రికెటర్లకు శుభవార్త

9న జిల్లా అండర్‌–12 జట్టు ఎంపికలు

నెట్స్‌ వద్ద ప్రాక్టీసులో చిన్నారులు

శ్రీకాకుళం న్యూకాలనీ: క్రికెట్‌లో రాణించాలనుకునే చిన్నారులకు జిల్లా క్రికెట్‌ సంఘం తీపి కబురు అందించింది. ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ గత కొన్నేళ్లగా పాఠశాల స్థాయిలో రాణిస్తున్న 12 ఏళ్లలోపు క్రీడాకారులను గుర్తించేందుకు ప్రణాళిక చేసింది. వీరిని ఉన్నతంగా తీర్చిదిద్దుతూ భవిష్యత్‌ క్రికెటర్లగా మార్చనున్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా అంతర్‌ జిల్లాలు, జోనల్‌ స్థాయి, రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించి క్రికెటర్లను ప్రోత్సహించాలని నిర్ణయించింది.

రంగం సిద్ధం

ఫ్యూచర్‌ క్రికెటర్ల గుర్తింపులో భాగంగా మొదటి అంకానికి రంగం సిద్ధం చేశారు. శ్రీకాకుళం జిల్లా అండర్‌–12 బాలుర జట్టు ఎంపికలు ఈనెల 9వ తేదీన జరగనున్నాయి. ఇందుకు జిల్లా క్రికెట్‌ సంఘం కసరత్తులు చేస్తుంది. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఎంపికల ప్రక్రియను నిర్వహిస్తారు. ఈ ఎంపికల్లో పాల్గొనే బాలురు 2013 సెప్టెంబర్‌ ఒకటి నుంచి 2015 ఆగస్ట్‌ 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఎంపికై న జిల్లా జట్టుని త్వరలో జరిగే ఏసీఏ నార్త్‌జోన్‌ అంతర్‌ జిల్లాల క్రికెట్‌ టోర్నీలో పాల్గొనే టోర్నీకి పంపించనున్నారు.

ప్రాబబుల్స్‌ ఎంపిక

తొలిత ప్రాబబుల్స్‌ జట్టును తీసి, శిక్షణా శిబిరాలను నిర్వహించి, అనంతరం సెలక్షన్‌ మ్యాచ్‌లను నిర్వహించి తుది జట్టును ఖరారు చేయాలని నిర్ణయించారు. కాగా ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమ ఒరిజినల్‌ ఆధార్‌కార్డు, ఫారం–5తో తెలుపు రంగు యూనిఫాంను ధరించి హాజరుకావాలని జిల్లా క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు పుల్లెల శాస్త్రి, కార్యదర్శి హసన్‌రాజా షేక్‌, మెంటార్‌ ఇలియాస్‌ మహ్మద్‌, కోశాధికారి మదీనా శైలానీ సంయుక్తంగా కోరారు. మరిన్ని వివరాలకు జిల్లా క్రికెట్‌ కోశాధికారి శైలానీ (9246631797), సంఘం చీఫ్‌ కోచ్‌ కె.సుదర్శన్‌ (9441115396) నంబర్లను సంప్రదించాలని సూచించారు.

క్రికెట్‌ సాధనలో క్రీడాకారులు

కొడితే కొట్టాలిరా.. సిక్స్‌ కొట్టాలి..! 1
1/1

కొడితే కొట్టాలిరా.. సిక్స్‌ కొట్టాలి..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement