● కూటమి కుట్రలు తిప్పికొట్టాలి
ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని మాజీ స్పీకర్, వైఎస్సార్‌ీసీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. హిరమండలం పాత బస్టాండ్ వద్ద వైఎస్సార్‌సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. ప్రతి ఒక్క సంతకం విద్యార్థుల భవిష్యత్‌కు మంచి చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
– హిరమండలం


