
ఉత్సాహంగా పద్యకవితల పోటీలు
శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో యువ రచయితల వేదిక అధ్యక్షురాలు తంగి ఎర్రమ్మ ఆధ్వర్యంలో జరిగిన నెలవారీ సమావేశంలో శనివారం పద్యకవితల పోటీలు ఉత్సాహంగా సాగాయి. బొంతు సూర్యనారాయణ, బోకర శ్రీనివాసరావు, రోణంకి విశ్వేశ్వరరావులు తొలి మూడు స్థానాల్లో నిలవగా.. రెడ్డి పద్మావతి, కుప్పిలి వెంకటరమణలకు కన్సోలేషన్ బహుమతులు లభించాయి. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ జిల్లా ఎన్విరాన్‌మెంట్ చైర్మన్ పొన్నాడ రవికుమార్, విశ్రాంత అధ్యాపకులు పిలకా శాంతమ్మ, డి.పార్వతీశం చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం భాషాభివృద్ధిపై ఆర్.ఢిల్లీశ్వరరావు, ఆర్.విశ్వేశ్వరరావు, ఆర్.పద్మావతి, జి.గోపాలకృష్ణ, కె.జనార్దనరావు, డి.పార్వతీశం, డి.ఈశ్వరరావులు కవితల్ని వినిపించారు. కార్యక్రమంలో డాక్టర్ పి.మాలతి, జి.సునీత, శివతేజ, ఆర్.శ్రీనివాసరావు పాల్గొన్నారు.