
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు నియామకం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ౖవెఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పుక్కళ్ల గురయ్యనాయుడును నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి శనివారం ప్రకటన విడుదల చేశారు. పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండల కేంద్రానికి చెందిన ఈయన రెండుసార్లు సర్పంచ్‌గా, మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తూ వైఎస్సార్ వీరాభిమానిగా పార్టీలో విధేయతతో సేవలందిస్తున్నారు. గురయ్యనాయుడు నియామకం పట్ల నియోజకవర్గం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
కవిటి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగం జాయింట్ సెక్రటరీగా ఇచ్ఛాపురం నియోజకవర్గం కవిటి మండలం డిగొనపపుట్టుగకు చెందిన బెందాళం జయప్రకాష్‌ను నియమిస్తూ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ పార్టీ పటిష్టతకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు.
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని తిలక్‌నగర్‌లో మహిళా యాంకర్ మీనా ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం..మీనా గత నెల 21న బీరువాలో భద్రపరిచిన బంగారు వస్తువులు చోరీకి గురవ్వడంతో ఈ నెల 10న పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు చోరీకి పాల్పడిన ది సీపన్నాయుడుపేటకు చెందిన బెండి అజ య్‌గా గుర్తించారు. ఈయనపై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. అజయ్ నుంచి ఐదు తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు నియామకం