
సిక్కోలు పుస్తక మహోత్సవానికి ఆహ్వానం
శ్రీకాకుళం కల్చరల్: వచ్చే నెలలో జరగనున్న సిక్కో లు పుస్తక మహోత్సవానికి రచతయిలకు, అభిమానులకు ఆహ్వానం పలుకుతున్నామని కమిటీ చైర్మన్ డాక్టర్ కె.సుధీర్ కోరారు. జిల్లా కేంద్రంలోని యూ టీఎఫ్ భవనంలో సిక్కోలు పుస్తక మహోత్సవ కమి టీ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు విజ యవాడ, హైదరాబాద్ వంటి ప్రదేశాల్లోనూ భారీ ఎత్తున పుస్తక ప్రదర్శనలు జరిగాయని, మన జిల్లాలో తొలిసారి నిర్వహిస్తుండటం శుభ పరిణామమన్నారు. కమిటీ కో–చైర్మన్ అట్టాడ అప్పలనాయుడు మాట్లాడుతూ సాంస్కృతిక వేదికపై జిల్లా సంస్కృతిని ప్రతిబింబించే తప్పెటగుళ్లు, జముకుల పాట, కోలాటం, పగటి వేషాలు, నాటికలు, డ్యా న్సులు, సంగీత ప్రదర్శనలు, ఏకపాత్రాభినయాలు తదితర ప్రదర్శనలు జరగనున్నాయని వివరించా రు. విద్యార్థులతో సైన్స్‌ఫెయిర్ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కమిటీ కన్వీనర్ కేతవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీకాకుళం ఏడురోడ్ల కూడలి వద్ద ఎన్‌టీఆర్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్‌లో నవంబరు 11 నుంచి 20 వరకు జరిగే సిక్కో లు పుస్తక మహోత్సవం–2025, సాహిత్య, సాంస్కృతిక వైజ్ఞానిక సంబరాల్లో 100 ప్రచురణకర్తలు బుక్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారని వివరించారు. సాహిత్య, సాంస్కృతిక, విజ్ఞాన ఆహార, మీడియా, ప్రచార, శానిటేషన్, సెక్యూరిటీ, ఆర్థిక సబ్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో వివిధ ప్రజాసంఘాలు, సాహిత్య సంస్థల సభ్యులు కంచరాన భుజంగరావు, చీకటి దివాకర్, గొంటి గిరిధర్, పి.సుధాకర్, కొత్తకోట అప్పారావు, ఎల్.రామలింగస్వామి పాల్గొన్నారు.