నైపుణ్య శిక్షణతో.. భవిష్యత్తుకు భరోసా | - | Sakshi
Sakshi News home page

నైపుణ్య శిక్షణతో.. భవిష్యత్తుకు భరోసా

Oct 12 2025 6:30 AM | Updated on Oct 12 2025 6:30 AM

నైపుణ

నైపుణ్య శిక్షణతో.. భవిష్యత్తుకు భరోసా

నైపుణ్య శిక్షణతో.. భవిష్యత్తుకు భరోసా నమ్మకం పెరిగింది.. శిక్షణ బాగుంది.. భవిష్యత్తుకు బాటలు.. 30 రోజుల పాటు ట్రైనింగ్‌.. బ్యాచ్‌ల వారీగా శిక్షణ..

వారికి వరం..

వివిధ ట్రేడుల్లో ఉచిత ట్రైనింగ్‌

బ్యాచ్‌ల వారీగా హాజరవుతున్న యువత

శిక్షణ అనంతరం మెరుగైన ఉపాధి

సౌకర్యాలతో కూడిన శిక్షణ

డిగ్రీ పూర్తి చేశాను. ప్రస్తు తం ఏ ఉద్యోగానికి వెళ్లినా కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలని, నైపుణ్యత ఉండాలని అంటున్నారు. ఇక్కడ ఫొటోగ్రఫీతో కంప్యూటర్‌ పరిజ్ఞానం కల్పిస్తున్నారు. అన్ని అంశాలు అర్ధమయ్యేలా నేర్పిస్తున్నారు. ఉద్యోగం సాధించగలననే నమ్మకం పెరిగింది.

– వి.మహేష్‌, శ్రీకాకుళం

పీజీ చదివాను. కంప్యూటర్‌ పరిజ్ఞానంతో పాటు ఫొటోగ్రఫీలో మెలకువలు నేర్పిస్తున్నారు. మంచి నైపుణ్యం సాధిస్తే కెరీర్‌కు ఉపయోగంగా ఉంటుందని చేరాను. అన్ని అంశాలు బాగా నేర్పిస్తున్నారు. ఉపాధిలో స్థిరపడతాననే నమ్మకం కుదిరింది.

– సీహెచ్‌ చిరంజీవి, కొర్లకోట

ఎచ్చెర్ల :

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించ డమే లక్ష్యంగా ఎచ్చెర్లలో పలు రంగాల్లో ఉచిత శిక్ష ణ ఇస్తున్నారు. ఎచ్చెర్ల మండల కేంద్రంలోని యూ నియన్‌ బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో యువతకు పలు విభాగాల్లో నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. నెలకు రెండు ట్రేడులకు శిక్షణ చొప్పున ఏర్పాటుచేసి మెలకువలను నేర్పించడంతో పాటు ఉపాధి కల్పనకు చేయూతనందిస్తున్నారు. ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, మొబైల్‌ సర్వీసింగ్‌, బ్యూటీపార్లర్‌, అల్లికలు, ఎలక్ట్రికల్‌ హౌ స్‌ వైరింగ్‌ వంటి 18 ట్రేడుల్లో ఇక్కడ యువత శిక్షణ పొందుతున్నారు.

డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌ చదివినా సరైన నైపుణ్యాలు లేకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగం లభించడం కష్టం. దీనిని గుర్తించిన అధికారులు నేటి యువత కు ఉద్యోగానికి అవసరమైయ్యే నైపుణ్యాలు పెంచుకునేందుకు వివిధ రంగాల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఉన్నత చదువులు పూర్తి చేసిన వారితో పాటు ఇంట ర్‌, డిగ్రీ, చదువుతున్న విద్యార్థులు నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు.

ప్రస్తుతం ఎచ్చెర్లలో యూనియన్‌ బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలో ఫొటోగ్రపీ, మొబై ల్‌ రిపెయిరింగ్‌ విభాగంలో పలువురు యువత చేరి తమ నైపుణ్యాలకు పదును పెట్టుకుంటున్నారు. ఇంటర్‌, డిగ్రీ, పీజీ చదువుతున్న 60 మంది విద్యా ర్థులు శిక్షణ పొందుతున్నారు. ఉచిత వసతి, భోజన సౌకర్యాలతో 30 రోజుల పాటు శిక్షణ అందిస్తున్నా రు. శిక్షణ అనంతరం యూనియన్‌ బ్యాంక్‌ రూరల్‌ సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ క్షేత్ర స్థాయిలో పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి ధ్రువపత్రాలను అందిస్తోంది. అవసరమైన వారికి బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేసి ఆర్థిక తోడ్పా టు అందిస్తున్నారు. శిక్షణా కాలంలో కంప్యూటర్‌ ప్రాథమిక అంశాలు, ఎంఎస్‌ ఆఫీస్‌, ఫోటోషాప్‌, పేజ్‌మేకర్‌, తెలుగు, ఇంగ్లిష్‌ టైప్‌రైటింగ్‌ వంటి అంశాలపైనా అవగాహన కల్పిస్తున్నారు.

బ్యాచ్‌కు 30 మంది చొప్పున నెలకు రెండు బ్యాచ్‌ల కు శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఫొటోగ్రఫీ, మొబైల్‌ సర్వీసింగ్‌ ట్రేడుల్లో శిక్షణ పొందుతున్నారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందించడంతో పాటు సంబంధిత కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు.

శిక్షణ సమయంలో ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పిస్తున్నారు.

వివిధ కారణాలతో చదువు మధ్యలోనే మానేసి ని వారికి ఈ శిక్షణలు ఆపన్నహస్తంగా మారా యి. పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ వర కూ చదువుకుని ఇంటి వద్ద పరిస్థితులు బాగాలేక చదువుకోని నిరుపేదలకు ఈ శిక్షణలు తోడుగా ఉంటున్నాయని చెబుతున్నారు. 18 ఏళ్లు నిండి పదో తరగతి వరకూ చదువుకున్న యువత అందరూ అర్హులే.

ఇక్కడ విద్యార్థులకు అన్ని విధాలా సౌకర్యాలతో కూడి న శిక్షణ అందిస్తున్నాం. ఉచిత భోజన, వసతి సౌకర్యాలతో కూడిన శిక్షణ అందిస్తున్నాం. శిక్షణ అనంతరం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం.

– రామ్‌జీ, యూనియన్‌ బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ, ఎచ్చెర్ల

నైపుణ్య శిక్షణతో.. భవిష్యత్తుకు భరోసా 1
1/3

నైపుణ్య శిక్షణతో.. భవిష్యత్తుకు భరోసా

నైపుణ్య శిక్షణతో.. భవిష్యత్తుకు భరోసా 2
2/3

నైపుణ్య శిక్షణతో.. భవిష్యత్తుకు భరోసా

నైపుణ్య శిక్షణతో.. భవిష్యత్తుకు భరోసా 3
3/3

నైపుణ్య శిక్షణతో.. భవిష్యత్తుకు భరోసా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement