
18న చెకుముకి సైన్స్ సంబరాలు
శ్రీకాకుళం: చెకుముకి సైన్స్ సంబరాలను విజయ వంతం చేయాలని జన విజ్ఞాన వేదిక ఎడ్యుకేషన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గొంటి గిరిధర్ పిలుపునిచ్చా రు. శ్రీకాకుళంలోని యూటీఎఫ్ భవనంలో చెకుము కి సైన్స్ సంబరాల కన్వీనర్ పి.కూర్మారావు అధ్యక్షతన పోస్టర్లు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గిరిధర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చెకుముకి సైన్స్ సంబరాలు పాఠశాల స్థాయిలో అక్టోబర్ 18న, మండల స్థాయిలో నవంబర్ 1న, జిల్లా స్థాయిలో నవంబర్ 23న, రాష్ట్ర స్థాయిలో డిసెంబర్ 12 నుంచి 14 తేదీల్లో జరుగుతాయని వివరించా రు. విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయు లు, విద్యార్థులు, సైన్స్ అభిమానులు హాజరై విజ యవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి కె.కామేశ్వరరావు, జి.వాసుదేవరావు, ఎస్.సాయి శ్రీనివాస్ శ ర్మ, యూటీఎఫ్ జిల్లా నాయకులు బి.శ్రీరామ్మూర్తి, పి.అప్పారావు, బి.ధనలక్ష్మి, ఎస్.స్వర్ణకుమారి, బి. మోహనరావు, ఎస్.సంజీవరావు పాల్గొన్నారు.