పదోన్నతులు కలేనా? | - | Sakshi
Sakshi News home page

పదోన్నతులు కలేనా?

Sep 30 2025 9:02 AM | Updated on Sep 30 2025 9:02 AM

పదోన్

పదోన్నతులు కలేనా?

శ్రీకాకుళం: డీఈఓ పూల్‌లోని పండితులు పదోన్నతులకు నోచుకోవడం లేదు. అనేక ఏళ్లుగా అప్‌గ్రేడేషన్‌ కోసం పోరాటం చేస్తున్న వీరికి 2019లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మద్దతుగా నిలిచారు. వీరి గోడును తెలుసుకొని అప్‌గ్రేడేషన్‌ కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా పండితులుగా పనిచేస్తున్న 1200 మంది పండితులు స్కూల్‌ అసిస్టెంట్‌ భాషోపాధ్యాయులుగా పదోన్నతి పొందారు. అయితే రాష్ట్రంలో 1134 మంది పండితులు పోస్టులు ఖాళీగా లేకపోవడంతో డీఈవో పూల్‌లోనే నేటికీ కొనసాగుతూ వస్తున్నారు. అందులో శ్రీకాకుళం జిల్లాలో 87 మంది పండితులు ఇప్పటికీ పదోన్నతులకు నోచుకోకుండా డీఈవో పూల్‌లోనే ఉండిపోయారు. వీరిలో 65 తెలుగు పండిట్లు, 18 ఒరియా పండిట్లు, 4 హిందీ పండిట్లు ఉన్నారు. ఈ కారణంగా ఏటా ఉపాధ్యాయులకు బదిలీలు చేసినప్పుడు వీరి ప్రమేయం లేకుండానే మారుమూల ప్రాంతాలకు బదిలీ అవుతున్నారు. దీంతో వారంతా మానసిక ఆందోళనకు గురవుతున్నారు. డీఈవో పూల్లో ఉన్న వారికి స్కూల్‌ అసిస్టెంట్‌ స్థాయి జీతాలు చెల్లించడం లేదు. పండిట్లకు ఇచ్చే జీతాన్నే ఇస్తున్నారు.

కోర్టు చెప్పినా..

రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వులను సైతం బేఖాతరు చేస్తోంది. పండితులకు పదోన్నతులు కల్పించకపోగా, ఏటా వారి ప్రమేయం లేకుండానే బదిలీల చేస్తుండటంపై విసిగి వేశారిన పండితులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై క్షుణ్ణంగా పరిశీలించిన ధర్మాసనం తక్షణం పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సమాన పనికి తగిన వేతనం ఇవ్వాలని 2024 డిసెంబర్‌లో తీర్పును వెలువరించింది. ఇది జరిగి తొమ్మిది నెలలు కావస్తున్నా ప్రభుత్వంలో స్పందన కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఎస్జీటీలు సైతం కోర్టును ఆశ్రయించగా యథాస్థితి కొనసాగించాలని ఆదేశించింది. మరలా దీనిపై పండితులు కోర్టును ఆశ్రయించగా, హైకోర్టు తాజాగా స్టేటస్‌ కోను ఎత్తివేసింది. అయినా ప్రభుత్వం పదోన్నతులకు చర్యలు తీసుకోకపోవడం పట్ల పండితులు తీవ్ర మానసిక వేదనకు గురవుతూ ఉద్యమానికి సిద్ధపడుతున్నారు. ఇతర ఉపాధ్యాయ సంఘాలు సైతం వీరికి అండగా నిలవాలని యోచిస్తున్నారు.

కోర్టు తీర్పు అమలు చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం తక్షణం హైకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి పండితులకు పదోన్నతులు కల్పించాలి. నెలలు గడుస్తున్నా తాత్సారం చేయడం సరికాదు. ప్రత్యేక బదిలీలతో వీరిని వేధిస్తున్నారు.

– పిసిని వసంతరావు, అధ్యక్షుడు,

రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ

వేదనకు గురవుతున్నాం

పండితులకు పదోన్నతులు ఇవ్వకపోగా ఏటా మారుమూల ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారు. దీని వల్ల మానసిక ఆందోళనకు గురవుతున్నాం. హైకోర్టు ఇచ్చిన తీర్పును సైతం అమలు చేయకపోవడం సరైన పద్ధతి కాదు.

– లోలుగు ప్రసాద్‌, డీఈఓ పూల్‌ పండితుడు

ప్రమోషన్లకు నోచుకోని డీఈవో పూల్‌ పండితులు

పదేళ్లుగా తప్పని నిరీక్షణ

ఏటా మారుమూల ప్రాంతాలకు బదిలీ

అమలు కాని కోర్టు ఉత్తర్వులు

పదోన్నతులు కలేనా?1
1/2

పదోన్నతులు కలేనా?

పదోన్నతులు కలేనా?2
2/2

పదోన్నతులు కలేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement