మలేషియాలో ఉత్తరాంధ్ర జానపద కళారూపాలు | - | Sakshi
Sakshi News home page

మలేషియాలో ఉత్తరాంధ్ర జానపద కళారూపాలు

Sep 30 2025 9:02 AM | Updated on Sep 30 2025 9:02 AM

మలేషి

మలేషియాలో ఉత్తరాంధ్ర జానపద కళారూపాలు

పలాస: మలేషియాలో నివసిస్తున్న తెలుగు ప్రజలకు చెక్కభజన, కోలాటం, తదితర జానపద కళారూపాల్లో శిక్షణ ఇచ్చే అవకాశం ఉత్తరాంధ్ర జానపద కళాకారులకు దక్కడం గొప్ప విషయమని పలాస మండలం రంగోయి గిడుగురామ్మూర్తి తెలుగు భాషా జానపద కళాపీఠం వ్యవస్థాపకుడు బద్రి కూర్మారావు చెప్పారు. కళాపీఠం సభ్యులు తవిటినాయుడు, సాయికుమార్‌లు మలేషియాలో నెలరోజుల పాటు అక్కడి తెలుగువారికి జానపద కళల్లో శిక్షణ ఇస్తున్నారని తెలిపారు.

స్తంభాన్ని ఢీకొట్టి

యువకుడు మృతి

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లాకేంద్రంలోని ఆర్ట్స్‌ కళాశాల సమీప వాటర్‌ట్యాంక్‌ వద్ద విద్యుత్తు స్తంభాన్ని ద్విచక్రవాహనంపై వస్తున్న ఓ యు వకుడు ఢీకొట్డాడు. ఈ నెల 27న జరిగిన ఈ ప్రమాదంలో విశాఖపట్నం హనుమంతువాకకు చెందిన కొత్తలంక పూర్ణచంద్రరావు తీవ్రంగా గాయపడి ఆదివారం రాత్రి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ట్రాఫిక్‌ పోలీసులు సోమవారం వెల్లడించారు.

వివాహమై మూడు నెలలే..

శ్రీకాకుళం రిమ్స్‌ ప్రభుత్వాసుపత్రిలో పరిపాలనావిభాగంలో కార్యాలయ అసిస్టెంట్‌గా ఉన్న పూర్ణచంద్రరావుకు విశాఖ యువతి పావనితో మూడు నెలల కిందట వివాహమైంది. పూర్ణచంద్రరావు కారుణ్య నియామకంలో రిమ్స్‌లో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. శనివారం రిమ్స్‌ లో గాయాలతో పూర్ణచంద్రరావు చేరినా అక్క డి సిబ్బంది ఎందుకో గోప్యంగా ఉంచారని భార్య పావని చెప్పినట్లు ట్రాఫిక్‌ పోలీసులు పేర్కొన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుధాకర్‌ వెల్లడించారు.

పిడుగుపాటుకు వ్యక్తి మృతి

కొత్తూరు: సిరుసువాడ గ్రామానికి చెందిన కోటిలింగాల హరిచంద్ర (55) పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. సోమవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో గంట పాటు భారీ వర్షం కురిసింది. ఇంటి పెరటిలో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. అదే సమయములో ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉన్న హరిచంద్ర పిడగు ధాటికి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే కొత్తూరు సీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతి చెందాడు. హరిచంద్రకు భార్య అనసూయ, ముగ్గురు పిల్లలు ఉన్నారు.పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పేద కుటుంబం కావడంతో ప్రభుత్వం ఆదుకోవాలని యువజన నాయకులు పెద్దిన అమర్‌నాథ్‌, గ్రామస్తులు కోరారు.

తాటి వనాలతో సంరక్షణ

సోంపేట: తీర ప్రాంతం వెంబడి తాటి వనాలను పెంచడం ద్వారా ప్రకృతి విపత్తులు, తుఫానులు, సునామీల నుంచి రక్షణ లభిస్తుందని అటవీశాఖ చీఫ్‌ వైల్డ్‌ ఆఫ్‌ వార్డెన్‌ , అడిషనల్‌ పీసీసీఎఫ్‌ శాంతి ప్రియ పాండే అన్నారు. బట్టిగళ్లూరు గ్రామంలోని తీర ప్రాంతాన్ని అటవీ శాఖ అధికారులతో కలిసి పర్యటించారు. అటవీ శాఖ ద్వారా తాటి విత్తనాలు సేకరించి తీరప్రాంతం వెంబడి నాటే కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు. సముద్ర తాబేళ్ల సంరక్షణపై అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో శ్రీకాకుళం డీఎఫ్‌ఓ ప్రసన్న, కాశీబుగ్గ రేంజర్‌ మురళీ కృష్ణం నాయుడు, సెక్షన్‌ ఆఫీసర్‌ బిందుమతి, బీట్‌ ఆఫీసర్‌ సంతోష్‌కుమార్‌, ట్రీ ఫౌండేషన్‌ జిల్లా కోఆర్డినేటర్‌ సోమేశ్వరరావు, మత్స్యకార ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

మలేషియాలో ఉత్తరాంధ్ర జానపద కళారూపాలు  1
1/2

మలేషియాలో ఉత్తరాంధ్ర జానపద కళారూపాలు

మలేషియాలో ఉత్తరాంధ్ర జానపద కళారూపాలు  2
2/2

మలేషియాలో ఉత్తరాంధ్ర జానపద కళారూపాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement