
● దుర్గంధం..భరించలేం..
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని కొత్తరోడ్డు నుంచి జాతీయ రహదారి మీదుగా వెళ్లే మార్గం దుర్గంధభరితంగా మారింది. ఇక్కడి ఫుట్‌పాత్‌పై చెత్తాచెదారాలు పేరుకుపోవడంతో వాహనచోదకులు, పాదచారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పరిసర ప్రాంతాల్లో ఎక్కడ శుభకార్యాలు, ఫంక్షన్లు జరిగినా మిగిలిపోయిన భోజనాలు, ఇతర వ్యర్థాలను తీసుకొచ్చి ఇక్కడే పారబోస్తున్నారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు అవి కుళ్లిపోయి భరించలేని దుర్వాసన వెదజల్లుతోంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.