
కేసు విచారణ వేగవంతం చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: సోంపేట మండలంలోని బీల ప్రాంతంలో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఉద్యమం 2010 జూలై 14వ తేదీన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమంలో ముగ్గురు ఉద్యమకారులు దుర్మరణం పాలవ్వగా.. వంద లాది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 725 మందిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు బనాయించారు. అయితే ఈ కేసు విచారణ ఆలస్యమవుతుండడంతో కేసులో ప్రథమ ముద్దాయి, ఉద్యమ రూపకర్త బీన ఢిల్లీరావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సలహాదారు, హైకోర్టు న్యాయవాది చౌదరి లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో మరో 21 మంది ముద్దాయిలతో కలిసి మరో న్యాయవాది కరుకోల సింహాచ లంతో రిట్ పిటిషన్ దాఖలు చేశా రు. అనంతరం విచారణ జరిపిన హైకోర్టు ఈ కేసు విచారణను అత్యంత వేగంగా జరపాలని సోంపేట జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వారికి ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని ఉద్యమ రూపకర్త బీన ఢిల్లీరావు, హైకోర్టు న్యా యవాది చౌదరి లక్ష్మణరావులు మరికొందరు నిందితులతో కలిసి గురువారం శ్రీకాకుళంలో విలేకరు ల సమావేశంలో వివరించారు.