
అక్రమ ఇసుక ర్యాంపులపైఆకస్మిక దాడులు
పొందూరు: పొందూరు మండలంలో నిర్వహిస్తున్న అక్రమ ఇసుక ర్యాంపులు, ఇసుక డంపింగ్‌లపై బుధవారం అధికారులు సంయుక్తంగా ఆకస్మిక దా డులు చేశారు. జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు బొడ్డేపల్లిలో నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపు, సింగూరు కూడలి నుంచి బొడ్డేపల్లి వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇసుక నిల్వలను పరిశీలించారు. ఈ సమయంలో ఇసుక లోడుతో ఉన్న మూడు భారీ టిప్ప ర్లు, 4 జేసీబీలు, ఒక ట్రాలీ, 10 ట్రాక్టర్లను పట్టుకున్నారు. బొడ్డేపల్లి ర్యాంపులోనూ ఇసుక నిల్వల వద్ద టిప్పర్లు, లారీల్లోకి ఇసుకను డంప్ చేస్తున్న సమయంలో జేసీబీలను స్వాధీనం చేసుకు న్నారు. ఈ సందర్భంగా ర్యాంపు నిర్వాహకుల గురించి వాహ న డ్రైవర్లను ప్రశ్నించారు. అయితే తాము కేవలం ఇసుకను మాత్రమే తీసుకెళ్తామని, లావాదేవీలన్నీ తమ వాహన ఓనర్లే చూసుకుంటున్నారని డ్రైవర్లు తెలిపారు. ఇసుక ర్యాంపుల వద్ద, ఇసుక డంపింగ్ కేంద్రాల వద్ద ఉన్న రికార్డులను అధికారులు స్వాధీ నం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఆర్డీవో సాయి ప్రత్యూష, డీఎస్పీ వివేకానంద, మైనింగ్ డీడీ మోహనరావు, ఏడీ విజయలక్ష్మి, తహసీల్దార్ వెంకటేష్ రామానుజుల, ఎస్‌ఐ బాలరాజు పాల్గొన్నారు. ర్యాంపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేసి, వాహనాలను స్టేషన్‌కు తరలించారు.

అక్రమ ఇసుక ర్యాంపులపైఆకస్మిక దాడులు