
క్రెడాయ్ నూతన కార్యవర్గం ఎన్నిక
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): స్థానిక ఒక ప్రైవేటు హోటల్‌లో శ్రీకాకుళం క్రెడాయ్–2025 నూతన కార్యవర్గం ఎన్నిక గురువారం జరిగింది. వైజాగ్ చాప్టర్ ప్రెసిడెంట్ అశోక్, స్టేట్ ప్రెసిడెంట్ బోయిన శ్రీనివాసరావు, స్టేట్ చైర్మన్ ముని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో శ్రీకాకుళం చాప్టర్ ప్రెసిడెంట్‌గా పొట్నూరు రమేష్ చక్రవర్తి, సెక్రటరీగా ఆదీప్ రెడ్డి, చైర్మన్‌గా బెండి నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్లుగా దుంగ సుధాకర్, కో రాడ సత్యారావు, గంజి భీమారావు, డోల వంశీ బాలకృష్ణ, ట్రెజరర్‌గా పృథ్వీరాజ్, ఎక్స్ ఆఫీషియో మెంబర్‌గా ముని శ్రీనివాసరావు, యూత్ వింగ్ ప్రెసిడెంట్‌గా పూజారి బాలచందర్, సెక్రటరీగా ఎన్ని జగదీష్, వైస్ ప్రెసిడెంట్‌గా లీలామోహన్ కృష్ణ, జాయింట్ సెక్రటరీగా వేదుల సంతోష్‌కుమార్ తదితరుల ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎల్జీపీ ఇంజినీర్లు పాల్గొన్నారు.