
హోటల్‌లో అగ్ని ప్రమాదం
పాతపట్నం: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న అబీబీ డ్రైవ్ ఇన్ హోటల్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హోట ల్ మొదటి ఫ్లోర్ మొత్తం పూర్తిగా మంటల్లో కాలి బూడిదయింది. ప్రమాదం సంభవించిన సమయంలో హో టల్‌లో పలువురు భోజనం చేయడంతో పాటు సిబ్బంది పనిచేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన ప్రమాదం జరిగిందని హోటల్ యాజమాని రెడ్డి తెలి పారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని, ఆస్తి నష్టం రూ.2 లక్షల వరకు ఉంటుందంటున్నారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు, రెవెన్యూ సిబ్బంది చేరుకుని, ప్రమాదం వివరాలు నమోదుచేసుకున్నారు.