వరుస తుఫాన్లతో మత్స్యకారుల ఆకలి కేకలు వేట నిషేధం తర్వాత ఐదుసార్లు తుఫాన్ హెచ్చరికలు ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబాలు ఆదుకోవాలని వేడుకోలు
పస్తులతో జీవనం
సముద్రంలో వేట సాగించేందుకు వాతావరణం అనుకూలంగా ఉండడం లేదు. తప్పనిసరి పరిస్థితు ల్లో వేటకు విరామం తప్ప డం లేదు. వేట నిషేధ భృతి మాదిరిగానే వేట విరామ సమయంలో మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునేలా ప్రత్యేక భృతిని ప్రకటించాలి. జీవనోపాధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. మత్స్యకార భరోసా రెండేళ్లకు ఒక ఏడాది మాత్రమే అందించారు. మరో ఏడాది భరోసా అందించి ఆదుకోవాలి.
– కోనాడ నర్సింగరావు,
జిల్లా మత్స్యకార సంఘం మాజీ అధ్యక్షుడు
గార:
కడలి తల్లి కరుణిస్తే గానీ కడుపు నిండని పరిస్థితి మత్స్యకారులది. వేట సాగితేనే కుటుంబాల పూట గడుస్తుంది. అయితే ఇటీవల వరుసగా ఏర్పడుతున్న తుఫాన్లు మత్స్యకారుల్లో ఆందోళన సృష్టిస్తున్నాయి. సంద్రం అల్లకల్లోలంగా మారుతుండడంతో వేట సాగడం లేదు. వేట నిషేధం అనంతరం వరుసగా నాలుగు నెలల్లో ఏకంగా 27 రోజుల పాటు తుఫాన్లు, వాయుగుండాల ప్రభావం వలన వేటకు వెళ్లలేకపోయారు. దీంతో ఆయా కుటుంబాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో ఎక్కడ తుఫాన్ సంభవిస్తున్నా వాతావరణ హెచ్చరికలు ఆధారంగా అప్రమత్తత పేరుతో వేట నిలిపేయాలని అధికారులు దండోరా వేయిస్తున్నారు. కానీ ఒక్కోసారి వాతావరణ హెచ్చరికలకు విరుద్ధంగా సముద్రంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకపోయినా వేటకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండిపోతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. అందువలన ప్రతీ ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు వేట నిషేధ సమయంలో భృతి ఇస్తున్నట్టే.. తుఫాన్, వాయుగుండాల సమయంలో వేటకు వెళ్లకుండా అర్థిక ఇబ్బందులు పడుతున్న మత్స్యకారులకు భృతి ఇవ్వాలని కోరుతున్నారు.
జిల్లాలో 193 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి తీర ప్రాంతంలోని 11 మండలాల్లో మత్స్యకారులు జీవనోపాధి సాగిస్తున్నారు. మొత్తం 1,526 మెకనైజ్డ్ బోట్లు, 2,606 నాన్ మెకనైజ్డ్ బోట్లుపై వేట సాగిస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వేట నిషేధ భృతి అర్హులైన మత్స్యకారులందరికీ అందిస్తే.. కూటమి ప్రభుత్వం అనేక ఆంక్షలు పెట్టి మత్స్యకారులను తగ్గించిందన్న విమర్శలున్నాయి. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకార భృతి ఒక సంవత్సరం ఇవ్వకపోవడం గమనార్హం.
కొన్ని రోజులుగా సముద్రంలో వేట సక్రమంగా సాగ డం లేదు. తరుచూ తుఫాన్ లు ఏర్పడడంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. ఏ రోజుకారోజు వేట సాగించి జీవిస్తుంటాం. ఈ సమయంలో రోజుల తరబ డి వేట సాగకపోతుండడంతో జీవనం కష్టతరంగా ఉంటోంది. పస్తులతో కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. ఈ ఏడాది ఎక్కువగా వాయుగుండాలు, తుఫాన్లు వస్తుండడంతో బోట్లు, వలలు భద్రపర్చుకోవడం కష్టతరంగా మారుతోంది.
– పుక్కళ్ల తవిటయ్య, మత్స్యకారుడు,
బందరువానిపేట
వేట సాగక.. పూట గడవక..!
వేట సాగక.. పూట గడవక..!
వేట సాగక.. పూట గడవక..!